విక్టరీ వెంకటేష్ క్లాప్‌తో ప్రారంభమైన మా ఆయి ప్రొడక్షన్స్ యాక్షన్ థ్రిల్లర్ '22'
- IndiaGlitz, [Monday,July 22 2019]
శివకుమార్ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ '22'. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈరోజు (జులై 22) రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. హీరోహీరోయిన్లపై విక్టరీ వెంకటేష్ క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, నవీన్ ఎర్నేని, కొండా కృష్ణం రాజు సంయుక్తంగా కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ముహూర్తపు షాట్‌కు ప్రముఖ దర్శకులు భీమినేని శ్రీనివాస రావు గౌరవ దర్శకత్వం వహించారు. పవర్‌ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ చిత్ర దర్శకుడు శివకుమార్‌కి స్క్రిప్ట్ అందించి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ చిత్రం పూజ కార్యక్రమాలు 'పవర్' దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) నిర్వహించారు. విశిష్ట అతిథిగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమానికి సి.అశ్వనీదత్, కె.ఎస్. రామారావు, యం.యస్.రాజు, అనీల్ సుంకర, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్, ఎస్.వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, కె.కె. రాధామోహన్, సముద్ర, నిమ్మకాయల ప్రసాద్, చిట్టూరి శ్రీనివాసరావు, సాగర్ తదితరులు హాజరై దర్శక నిర్మాతలకి, చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
ఇటీవలి కాలంలో చిన్న సినిమాకి ఇంతమంది అతిథులు హాజరై శుభాకాంక్షలు తెలపడం విశేషం.
దర్శకుడు శివకుమార్ బి. మాట్లాడుతూ - ''ఈ ప్రారంభోత్సవానికి మా యూనిట్‌ని బ్లెస్ చెయ్యడానికి వచ్చిన విక్టరీ వెంకటేష్ గారికి, సాయితేజ్, హరీష్ శంకర్, బాబీ గారికి, అలాగే ప్రముఖ దర్శకులు, నిర్మాతలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను దర్శకుడిగా పరిచయమయుతున్న తొలి చిత్రానికి విక్టరీ వెంకటేష్ గారు క్లాప్ నివ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా సాయి తేజ్ గారి రెండు సినిమాలకు పని చేశాను. ఆయన ఈ కార్యక్రమానికి రావడం హ్యాపీ గా ఉంది. నేను మారుతి, పూరి జగన్నాథ్, వి.వి.వినాయక్‌గార్ల వద్ద వర్క్ చేశాను. ఆ ముగ్గురి ఇన్‌స్పిరేషన్ వల్లే ఈరోజు నేను మీ ముందున్నాను.
మా ప్రొడక్షన్ హెడ్ ఆనీలామా మాస్టర్ ద్వారా నేను నిర్మాత శ్రీమతి సుశీలాదేవిగారిని కలిసి కథ చెప్పడం జరిగింది. సలోని పూరి కనెక్ట్స్ నుండి వచ్చింది. మేం వెళ్ళి అడగ్గానే డేట్స్ అడ్జెస్ట్ చేసి ఇచ్చిన పూరి కనెక్ట్స్ పూరి జగన్నాథ్, ఛార్మిగార్లకు థాంక్స్. అలాగే 'ఇస్మార్ట్ శంకర్'తో బ్లాక్ బస్టర్ సాధించినందుకు మా చిత్ర యూనిట్ తరపున కంగ్రాట్స్. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేం పూజా రామచంద్రన్ ఒక క్రూషియల్ క్యారెక్టర్ చేస్తుంది. ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. అలాగే 'బాహుబలి', 'ఖైదీ నెం 150 ','సాహో' చిత్రాలకి వర్క్ చేసిన జాషువాగారి యాక్షన్ సీక్వెన్స్ మా చిత్రానికి హైలైట్స్‌గా నిలుస్తాయి. నాకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఎవరంటే మా మదర్ జయగారు. మా అమ్మగారి దగ్గర ప్రొడక్షన్‌తో పాటు దర్శకత్వ శాఖలో మెళకువలు నేర్చుకున్నాను. ఆవిడ ఎక్కడ ఉన్నా ఇవన్నీ చూసి ఆనందిస్తారనుకుంటున్నాను. అలాగే మా నాన్న బి.ఏ రాజుగారు ఎప్పుడూ నన్ను ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ '22' అనేది ఒక నెంబర్. ఆ నెంబర్‌కి ఒక కీ ట్విస్ట్ ఉంది. అది రివీల్ చేస్తే ఆ కిక్ ఉండదు. మర్డర్ మిస్టరీతో మిక్స్ అయిన కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈనెల 29 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.'' అన్నారు.
హీరో రూపేష్ కుమార్ చౌదరి మాట్లాడుతూ - ''నాకు చిన్నప్పటి నుండి మంచి ఆర్టిస్ట్ కావాలని కోరిక ఉండేది. ఆ కోరిక ఈరోజు నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్ ని ఆయన సినిమాలు ఒక్కొక్కటి పది పదిహేను సార్లు చూశాను. అలాంటిది నా మొదటి సినిమాకు విక్టరీ వెంకటేష్ గారు క్లాప్ కొట్టడం చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. ఒకరోజు శివగారిని కలిశాం. అలా ఇద్దరం డిస్కస్ చేసుకొని ఆయన దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ చేశాం. '22' చాలా మంచి స్క్రిప్ట్. మంచి టీమ్ కుదిరింది. ఈ సినిమాలో డ్యాన్స్, ఫైట్స్ కోసం శిక్షణ తీసుకుంటున్నాను. మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికీ నచ్చేవిధంగా దర్శకుడు శివకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు'' అన్నారు.
ప్రొడక్షన్ హెడ్ ఆనీ లామా మాట్లాడుతూ - ''ముందుగా నా ఛైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అమిత్‌కి థాంక్స్. ఆయన వల్లే రూపేష్ పరిచయమయ్యారు. యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎవరన్నా మంచి దర్శకుడితో వర్క్ చేద్దాం అనుకున్నాం. ఆ టైమ్‌లో నాకు శివ గుర్తొచ్చారు. మేమిద్దరం పూరిగారి సినిమాలకి వర్క్ చేశాం. అలా డైరెక్షన్ మీద ఎంతో ప్యాషన్ ఉండటంతో వీళ్లిద్దరినీ కలిపాను. అలా ఒక వెబ్ సిరీస్ చేశాం. అందులో నేను నటించాను. అందరూ ఎంతో కష్టపడి సినిమా కోసం పని చేస్తున్నాం. ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ అందరికీ థాంక్స్'' అన్నారు.
హీరోయిన్ సలోని మిశ్రా మాట్లాడుతూ - ''మా చిత్రం ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులందరికీ థాంక్స్. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్ర దర్శకుడు శివ అమేజింగ్ పర్సన్. ఈ సినిమా ట్విస్ట్ అండ్ టర్న్‌లతో అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. అలాగే కోయాక్టర్స్ రూపేష్ కుమార్, పూజతో కలిసి పని చేయడం హ్యాపీ. నా తొలి చిత్రం 'ఫలక్‌నుమాదాస్' మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను.'' అన్నారు.
డిఓపి బి.వి. రవికిరణ్ మాట్లాడుతూ - ''నేను ముంబాయిలో కమల్ జిత్‌గారి దగ్గర వర్క్ చేశాను. శివతో కలిసి వెబ్ సిరీస్ చేశాను. ఇది రెండో ప్రాజెక్ట్. స్క్రిప్ట్‌తో పాటు టీమ్ అంతా బాగా కుదిరింది. అందరికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు.
చీఫ్ కో-డైరెక్టర్ పుల్లారావు మాట్లాడుతూ - ''నేను, శివ కలిసి వినాయక్‌గారి వద్ద పని చేశాం. మా ఆయి ప్రొడక్షన్స్‌లో రూపేష్‌కుమార్‌గారు హీరోగా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ అడ్డాల రాజు మాట్లాడుతూ - ''శివగారు ఒకరోజు ఆఫీస్‌కి పిలిచి మనం ఒక సినిమా చేస్తున్నాం అని కథ వినిపించారు. కథ చాలా బాగుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు, హీరోగారికి ధన్యవాదాలు'' అన్నారు.
నటి పూజా రామచంద్రన్ మాట్లాడుతూ - ''నాకు ఈ రోల్ ఇచ్చిన ఆనీ మాస్టర్‌కి థాంక్స్. ఆ క్యారెక్టర్‌కి సంబంధించి దర్శకుడు శివ నిన్ననే ఆడిషన్ చేశారు. పెర్‌ఫార్మెన్స్‌కి మంచి స్కోప్ ఉండే క్రూషియల్ క్యారెక్టర్. ఇది నాకు ఒక ఛాలెంజింగ్ రోల్. ఈ ప్రారంభోత్సవం ఇంత ఘనంగా జరగడం చాలా సంతోషంగా ఉంది'' అన్నారు.
అకౌంట్స్ హెడ్ సునీత శర్మ మాట్లాడుతూ - ''మా ఆయి ప్రొడక్షన్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. శివగారితో అసోసియేట్ అవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాకి విక్టరీ వెంకటేష్‌గారు క్లాప్ కొట్టారు కాబట్టి సినిమా తప్పకుండా విక్టరీ సాధిస్తుంది'' అన్నారు.
రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా, విక్రమ్‌జీత్, జయప్రకాష్, పూజ రామచంద్రన్, రాజేశ్వరి నాయర్, రవి వర్మ, ఫిదా శరణ్య, రాంబాబు వర్మ లంకా, మాస్టర్ తరుణ్ పవార్, బేబి ఓజల్ పవార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బి.వి. రవికిరణ్, సంగీతం: సాయి కార్తీక్, ఎడిటింగ్: శ్యామ్ వాడవల్లి, ఆర్ట్: అడ్డాల రాజు, యాక్షన్: స్టంట్ జాషువా, మేకప్: బాలు డెక్కా, కాస్ట్యూమ్స్: నరసింహారావు, స్టిల్స్: వరహాల మూర్తి, అకౌంట్స్ హెడ్: సునీత శర్మ, ప్రొడక్షన్ మేనేజర్: కాస కిరణ్ కుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్: సురేష్ రెడ్డి, చీఫ్ కో-డైరెక్టర్: పుల్లారావు కొప్పినీడి, ప్రొడక్షన్ హెడ్ అండ్ కొరియోగ్రఫీ: ఆనీ లామా, నిర్మాత: శ్రీమతి సుశీలా దేవి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివకుమార్ బి.