మీ టూ వైరముత్తు
Send us your feedback to audioarticles@vaarta.com
తనుశ్రీ దత్తా.. నానా పటేకర్ మధ్య చేలరేగిన కాస్టింగ్ కౌచ్ ప్రకంపనలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. బాలీవుడ్‌లో తను శ్రీ దత్తా మీ టూ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే.. దక్షిణాదిన చిన్మయి మీ టూ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది. ఈ వేధింపులు లిస్టులో మరో బాధితురాలు చేరింది. ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించారని సదరు బాధితురాలు తెలిపారు. ఆ బాధితురాలు చెప్పిన విషయాలను సంధ్యామీనన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. జాతీయ అవార్డులు సహా పద్మ విభూషణ్ అవార్డుని గెలుచుకున్న వైరముత్తు ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
``నేను వైర ముత్తు దగ్గర 18వ ఏట నుండి పనిచేశాను. ఆయనొక లెజెండ్‌గా చూశాను. కానీ ఆయన నిజ స్వరూపం తెలిశాక భయమేసింది. సాహిత్యాన్ని వివరించాలనే ఉద్దేశంతో నన్ను దగ్గరకు పిలిపించుకుని ముద్దు పెట్టుకునేవాడు.. కౌగిలించుకునేవాడు. ఏం చేయాలో తోచలేదు. ఓకే చెప్పి బయటపడ్డాను. ఒంటిరిగా ఉండటానికి భయపడి.. నలుగురితో ఉండటానికి ప్రయత్నించాను. ఆయన గురించి అందరికీ తెలిసినా.. అతనికున్న రాజకీయ సంబంధాల కారణంగా ఎవరూ నోరు మెదపరు. బాధితుల మౌనాన్ని ఆయన ఆసరాగా తీసుకుని మరింత రెచ్చిపోయేవాడు` అంటూ బాధితురాలు ఆరోపించిందని సంధ్యామీనన్ పెర్కొన్నారు. ఈ ఆరోపణలపై చిన్మయి, అముదన్ అనే దర్శకుడు స్పందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout