Rama Jogayya Sastry : ఆ ట్రోలింగ్‌కు హర్ట్.. దండం పెట్టేసిన రామజోగయ్య శాస్త్రి, పోస్ట్ వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి అభిమానులకు ట్రీట్ ఇవ్వాలనే ఉద్దేశంతో గోపీచంద్ మలినేని- బాలయ్య కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న వీరసింహారెడ్డి నుంచి జై బాలయ్య సాంగ్‌ను వదిలారు మేకర్స్. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తున్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా ట్రోల్ అవుతోంది. తెలుగు హిట్ మూవీలోంచి ఈ ట్యూన్‌ను మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లేపేశాడంటూ ఆధారాలతో సహా ట్రోల్ చేస్తున్నారు. అన్నట్లు ఆ హిట్ మూవీ ఏదో కాదు. దర్శకరత్న దాసరి నారాయణ రావు దర్శకత్వంలో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి నటించిన ‘‘ఒసేయ్ రాములమ్మ’’ సినిమాలోని టైటిల్ సాంగ్. దానిని మక్కీకి మక్కీ దింపేశాడు థమన్. దీంతో ఈ పాట కాపీ ఇష్యూ ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
ఆ ట్రోలింగ్‌కు హర్ట్ అయిన రామజోగయ్య శాస్త్రి :
మరోవైపు... ఈ కాపీ విషయాన్ని ఓ వర్గం ప్రేక్షకులు సీరియస్‌గా తీసుకుని ఈ పాట రాసిన సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రిని టార్గెట్ చేశారు. అయితే ఈ ట్రోలింగ్ మరీ హద్దులు దాటడంతో రామజోగయ్య శాస్త్రి హర్ట్ అయ్యారు. ఈ వెంటనే ఆయన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
రామజోగయ్య ఆ ట్వీట్‌లో ఏమన్నారంటే:
ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను...దయచేసినన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు.. అన్నట్టు...జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరు ను సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి గా మార్చుకున్నాను..ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు.. ఉంటే ఇటు రాకండి అంటూ దండం పెట్టేస్తోన్న ఎమోజీలను షేర్ చేశారు రామజోగయ్య శాస్త్రి. మరి పెద్దాయన విజ్ఞప్తికైనా కనికరించి నెటిజన్లు ఆయనను వదిలేస్తారా లేదంటే ట్రోలింగ్ కొనసాగిస్తారా అన్నది చూడాలి.
అయ్యో..@abntelugutv ....నా ట్వీట్ వేరే విషయం మీద...ట్రోలింగ్ లేదు ఏమి లేదు...అందరు ఫాన్స్ నేనంటే చాలా ఇష్టపడతారు..ముఖ్యంగా ఈపాట పట్ల అందరూ సాహిత్యాన్ని చాలా మెచ్చుకుంటున్నారు..దయచేసి ఈ ఆర్టికిల్ లేపేయండి?? @subbaraon చూడండి ?? https://t.co/93cHNyAu2i
— RamajogaiahSastry (@ramjowrites) November 25, 2022
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments