ఈ అభినందన నన్ను ఆనందంలో ముంచెత్తింది - చంద్ర బోస్
Send us your feedback to audioarticles@vaarta.com
నేను నా సాహితీ ప్రస్థానంలో ఎన్నో పాటలు రాసాను-ఎన్నో పురస్కారాలు ,అభినందనలు అందుకున్నాను-కాని ఈ ఎంత సక్కగున్నావే పాటకు వస్తున్న స్పందన మాత్రం అపూర్వం.
దాదపు 15 రోజులు నా ఫోన్ మోగుతూనే వుంది ప్రశంసల జల్లు కురుస్తూనే వుంది-సినిమా ప్రముఖులు, స్నేహితులు,బంధువులు,పరిచయస్తులు అందరి నుండి అన్ని వర్గాల నుండి ఈ అభినందనలు నన్ను ఆనందంలో మంచెత్తాయి-అయితే ఆశ్చర్యనందానికి గురి చేసిన విషయం మీతో పంచుకోబోతున్నాను.
వంశీ కమల్ అనే అబ్బాయి ఈ పాటతో స్ఫూర్తి పొంది ఈ పాట రాసిన నా గురించి ఒక పాట రాసాడు-యిదే పాట వరసలో-నాకు చాలా వినూత్నంగా అనిపించి విస్మయాన్ని కలిగించింది-నేను దీనికి అర్హుడినో కాదో గాని ఒక తెలుగబ్బాయి హృదయాన్ని కదిలించి కవిత్వం పలికించాన్న తృప్తి కలిగుతోంది - మీ చంద్ర బోస్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments