సినీ గేయ రచయిత చంద్రబోస్కు మాతృవియోగం
- IndiaGlitz, [Monday,May 20 2019]
టాలీవుడ్ ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ ఇంట విషాదం నెలకొంది. బోస్ తల్లి మదనమ్మ సోమవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా గుండెపోటు వ్యాధితో బాధ పడుతున్న ఆమె సోమవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు మీడియా తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ నటీనటులు, దర్శకులు, తోటి రచయితలు ప్రగాఢ సంతాపం తెలిపి.. బోస్ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఇవాళ సాయంత్రం వరంగల్ జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
కాగా.. బోస్ స్వస్థలం వరంగల్ జిల్లా, చిట్యాల మండలం, చల్లగరిగె అనే కుగ్రామం. తండ్రి నర్సయ్య ఉపాధ్యాయుడు, తల్లి మదనమ్మ గృహిణి. వారికి మొత్తం నలుగురు సంతానం. వారిలో చంద్రబోస్ ఆఖరి వాడు. ముందు డిప్లోమా, ఆ తరువాత ఇంజనీరింగ్ చదివిన బోస్.. చదువు పూర్తయ్యే సమయంలో పాటలపై ఆసక్తి కలిగింది. ఒక స్నేహితుని సాయంతో సినీ ప్రముఖుల దగ్గరికి వెళ్ళి అవకాశాలు సంపాదించుకుని ప్రస్తుతం టాలీవుడ్ టాప్లో ఒకరుగా నిలిచారు.