లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మోడీ బయోపిక్ 'మనో విరాగి'

  • IndiaGlitz, [Thursday,September 17 2020]

గౌరవనీయులైన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా 'మనో విరాగి'. తెలుగు, తమిళ భాషలలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. తమిళంలో 'కర్మయోగి'గా విడుదల చేయనున్నారు. ఎస్. సంజయ్ త్రిపాఠీ రచన, దర్శకత్వంలో మహావీర్ జైన్ తో కలిసి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా పోస్టర్లు విడుదల చేశారు.

'మనో విరాగి'లో నరేంద్ర మోడీ పాత్రలో అభయ వర్మ నటిస్తున్నారు. మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లోని వాద్ నగర్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రదేశాలలో ఈ సినిమా చిత్రీకరణ చేశారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా 'ఖైదీ నెంబర్ 150' సమర్పకులుగా వ్యవహరించిన లైకా ప్రొడక్షన్స్ అధినేత ఎ. సుభాస్కరన్, తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా '2.0', 'దర్బార్' చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. విజయ్ హీరోగా నటించిన 'కత్తి', మణిరత్నం దర్శకత్వం వహించిన 'నవాబ్' చిత్రాలనూ నిర్మించారు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ప్రతిష్టాత్మక 'పొన్నియన్ సెల్వన్', కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో 'ఇండియన్ 2' చిత్రాలు నిర్మిస్తున్నారు.

'మనో విరాగి' గురించి ఎ. సుభాస్కరన్ మాట్లాడుతూ ప్రధాని మోడీ గారి టీనేజ్ జీవితంలో ముఖ్యమైన మలుపులతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో సమర్పిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం అని అన్నారు.

ఈ చిత్రానికి పిఆర్ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి, ఛాయాగ్రహణం: మహేష్ లిమయే, సహ నిర్మాణం: జనహిత్ మే జారీ ప్రొడక్షన్, రచన-దర్శకత్వం: ఎస్. సంజయ్ త్రిపాఠీ, నిర్మాణం: సంజయ్ లీలా భన్సాలీ, మహావీర్ జైన్, సమర్పణ: లైకా ప్రొడక్షన్స్

More News

కళ్లు చెదిరే రేటింగ్‌తో దూసుకుపోతున్న బిగ్‌బాస్ 4

బిగ్‌బాస్ సీజన్ 4 వైభవంగా ప్రారంభమైంది. ఇప్పటికే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసింది. గురువారం మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.

కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్‌‌లో తయారైందన్న డాక్టర్ లీకి షాక్..

కరోనా వైరస్ వూహాన్‌ ల్యాబ్‌లో తయారైందంటూ హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్ లి మెంగ్‌ యాన్‌ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా

విజయవాడ నగర వాసుల ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. కనకదుర్గ ఫ్లై ఓవర్ నగరానికే ఒక మణిహారంలా నిలవబోతోంది.

దర్శకుడు ఎన్. శంకర్ చేతుల మీదుగా తెరవెనుక ఫస్ట్ లుక్ విడుదల

ఆయుష్ క్రియేషన్స్ పతాకంపై విజయలక్ష్మి మురళి మచ్చ సమర్పణలో మురళి జగన్నాథ్ మచ్చ నిర్మాతగా రూపుదిద్దుకున్న చిత్రం " తెరవెనుక "

తెలంగాణలో ఆసక్తికర పరిణామం.. భట్టి ఇంటికి తలసాని..

తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంటికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..