కాళ్ల బేరానికొచ్చిన లైకా
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియాలోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది '2.0'. దాదాపు 550 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నవంబర్ 29న విడుదల కానుంది. నిజానికి ఈ సినిమాను విడుదల చేయడానికి ఏషియన్ సినిమాస్ ముందుకొచ్చింది. ప్రారంభంలో 80 కోట్ల రూపాయలను లైకా సంస్థకు చెల్లించి వీరు హక్కులను దక్కించుకున్నారు.
ఈయనకు డి.సురేశ్‌బాబు కూడా జత కలిశారు. అయితే సినిమా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడటం వల్ల తెలుగు నిర్మాతల ఒత్తిడితో లైకా సంస్థ వారిచ్చిన సగానికి పైగా డబ్బును వెనక్కి ఇచ్చేసింది. విడుదల తర్వాత మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తామని తెలిపింది. ఇప్పుడు సినిమాను దిల్‌రాజు, ఎన్.వి.ప్రసాద్ విడుదల చేస్తున్నారు.
అయితే ఏషియన్ సునీల్, సురేశ్‌బాబు అడ్డం తిరిగి తమ అడ్వాన్స్‌కు వడ్డీ చెల్లించమని లైకాను అడిగారు. చెల్లించను అని లైకా సంస్థకు చెప్పడానికి కుదరదు. ఎందుకంటే..ఏషియన్ సునీల్, సురేశ్‌బాబు చేతిలో సగానికి పైగా థియేటర్స్ ఉన్నాయి. దీంతో లైకా కాళ్ల బేరానికి కొచ్చినట్లు సమాచారం. అందువల్ల చెల్లించాల్సిన అడ్వాన్స్‌కు 4 కోట్ల రూపాయల వడ్డీని చెల్లించబోతుందని లోగుట్టు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com