లైకా ప్రొడక్షన్స్ అధినేత భారీ విరాళం.. సీఎం స్టాలిన్ ని కలిసి..

  • IndiaGlitz, [Saturday,June 19 2021]

కరోనా విపత్కర సమయంలో సాయం అందించేందుకు వరుసగా ప్రముఖులు ముందుకు వస్తున్నారు. కొందరు సొంతంగా సహాయ కార్యక్రమాలు చేపడుతుంటే మరికొందరు ప్రభుత్వాలకు విరాళాలు అందిస్తున్నారు. ఇటీవల తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది.

ఇదీ చదవండి: అతడే నా బెస్ట్ మొగుడు అంటూనే విడాకులు.. 3 పెళ్లిళ్లు, ఆమెకు ఏమైనా తిక్కా!

దీనితో కోలీవుడ్ సినీ ప్రముఖులు వరుసగా స్టాలిన్ ని కలుస్తున్నారు. సీఎం సహాయ నిధికి విరాళాలు అందిస్తున్నారు. తాజాగా భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ తమిళనాడు సీఎం సహాయ నిధికి రూ 2 కోట్ల విరాళం అందించారు. కోవిడ్ నివారణ చర్యలకోసం సుభాస్కరన్ ఈ గొప్ప సాయం అందించారు.

సుభాస్కరన్ తరుపున లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు శ్రీ జీకేఎం తమిళ్ కుమరన్, శ్రీ నిరుతన్, శ్రీ గౌరవ్ తదితరులు ముఖ్యమంత్రి స్టాలిన్ ని సచివాలయంలో కలుసుకున్నారు. రూ.2 కోట్ల చెక్ ని ఆయనకు అందించారు.

విజయ్ 'కత్తి', రజనీకాంత్ 2.0 లాంటి భారీ చిత్రాలని లైకా సంస్థ నిర్మించింది. ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్ర విషయంలో లైకా సంస్థకు, దర్శకుడు శంకర్ కు మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండియన్ 2 ప్రారంభమై కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకుంది. ఇలాంటి తరుణంలో విభేదాలు చెలరేగాయి.