Jude Anthany Joseph:అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ‘2018’ డైరెక్టర్ జూడ్ ఆంథని జోసెఫ్ సినిమా
- IndiaGlitz, [Wednesday,July 05 2023]
సినీ ప్రేమికులకు ఎప్పటికప్పుడు భారీ చిత్రాలు, విజువల్ వండర్స్ చిత్రాలనే కాదు.. వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్‌ను కూడా అందిస్తోన్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. ఓ వైపు స్టార్ హీరోలు, దర్శకులతో సినిమాలు చేస్తూనే యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటంలో ఈ సంస్థ ఎప్పుడూ ముందుటుంది. తాజాగా లైకా ప్రొడక్షన్ తమ బ్యానర్‌లో కొత్త సినిమాను రూపొందించనున్నట్లు అధికారిక ప్రకటననను విడుదల చేసింది. ఆ సినిమాను డైరెక్ట్ చేయబోయేదెవరో కాదు.. మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ జూడ్ ఆంథని జోసెఫ్.
రియల్ కాన్సెప్ట్‌తో ‘2018’ వంటి ఓ విభిన్నమైన సినిమాను తెరకెక్కించిన జూడ్ ఆంథని జోసెఫ్ అందరి దృష్టిని ఆకర్షించారు. 2018లో కేరళలో వరద బీభత్సాన్ని ఎవరూ మరచిపోలేరు. అయితే ప్రభుత్వానికి, ప్రజలు అండగా నిలవటంతో భయానక పరిస్థితుల నుంచి అందరూ బయటపడ్డారు. ఈ నిజ ఘటనను కళ్లకు కట్టినట్లు చూపించిన ఆంథని జోసెఫ్ .. మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులను మెప్పించటానికి రెడీ అయ్యారు.
ఈసారి ఆయనతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ చేతులు కలిపింది. కచ్చితంగా ప్రేక్షకులను అంచనాలను మించేలా ఓ మెస్మరైజింగ్ మూవీతో రాబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని లైకా ప్రతినిధులు తెలియజేశారు.
We are excited & thrilled 🤩 about this collaboration with the most happening director 🎬 #JudeAnthanyJoseph for our upcoming project! 🤗✨ pic.twitter.com/ORQVMPCWCv
— Lyca Productions (@LycaProductions) July 5, 2023