ప్రమాదంపై కమల్ హాసన్‌కు లైకా లేఖ
Send us your feedback to audioarticles@vaarta.com
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం `ఇండియన్ 2`. ఇటీవల ఈ సినిమా సెట్స్‌లో క్రేన్ యాక్సిడెంట్ జరిగింది. ఇందులో సినిమాకు సంధించిన వ్యక్తిగత సహాయకులు మధు, సాయికృష్, చంద్రన్ చనిపోయారు. పది మంది దాకా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై ట్విట్టర్ ద్వారా సానుభూతిని వ్యక్తం చేసిన కమల్‌హాసన్.. మృతుల కుటుంబాలను చిత్ర నిర్మాతలు ఆదుకోవాలని, షూటింగ్ సమయాల్లో భద్రత పరంగా చర్యలు తీసుకుంటేనే తాను షూటింగ్లో పాల్గొంటానని లేఖ ద్వారా కమల్ తెలిపారు. దీనికి ట్విట్టర్ ద్వారా లైకా ప్రొడక్షన్స్ స్పందించింది.
``షూటింగ్ సమయంలో క్రేన్ ప్రమాదం జరగడం దురదృష్టం. బాధిత కుటుంబాలకు సంస్థ తరపున రూ.2కోట్లు ఆర్థిక సాయాన్ని ప్రకటించాం. గాయపడిన వాళ్లకు చికిత్స అందిస్తున్నాం. ప్రమాదం జరిగినప్పటి నుండే చర్యలు చేపట్టాం. ఈ విషయాలు మీకు తెలియక పోవడం వల్లనే లేఖ రాశారని భావిస్తున్నాం. షూటింగ్స్ సమయంలో భద్రపరమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రొడక్షన్ భీమాతో పాటు వ్యక్తిగత భీమాలను కూడా సకాలంలో అందేలా చూస్తాం. మీకు కోరినవన్నీ ముందే చేశాం. షూటింగ్ తిరిగి ప్రారంభిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments