వివాదంపై స్పందించిన లైకా ప్రొడక్షన్స్
- IndiaGlitz, [Wednesday,August 28 2019]
దక్షిణాదిన ముఖ్యంగా కోలీవుడ్‌లో ప్రముఖ హీరోలందరితో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్న సంస్థ లైకా ప్రొడక్షన్స్. ఈ సంస్థ సూపర్‌స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో 'రోబో' సీక్వెల్‌గా '2.0' అనే విజువల్ వండర్‌ను నిర్మించింది. గత ఏడాది ఈ చిత్రం విడుదలైంది. కాగా.. రెండు వారాల ముందు ఈ సినిమాకు సంబంధించిన వివాదం బయటకు వచ్చింది. ప్రముఖ సబ్‌టైటిలిస్ట్ రేఖ్స్, లైకా ప్రొడక్షన్స్‌పై ఆరోపణలు చేసింది. సబ్‌టైటిల్స్ కోసం తనకు సంస్థ ఇస్తానన్న రెండు లక్షల రూపాయలు ఇవ్వలేదని పేర్కొంది. దీంతో అందరూ లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఇలా చేస్తుందేంటి? అని అనుకున్నారు.
ఈ వివాదంపై లైకా సంస్థ బుధవారం తమ అధికారిక ట్విట్టర్ ద్వారా స్పందనను తెలియజేసింది. అందులో భాగంగా అసలేం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తూ.. ఓ లెటర్‌ను విడుదల చేసింది. ''2.0' టైటిల్స్ కోసం రేఖ్స్తో చర్చించే సమయంలో ఆమె 2 లక్షల రూపాయలను అడిగారు. అయితే లైకా అంత ఇచ్చుకోలేదని చెప్పేసింది. ఆవిడ తర్వాత మాట్లాడుకుందామని చెప్పి, ఆవిడ అడిగిన మొత్తాన్ని మనసులో ఉంచుకుని పని పూర్తి చేశారు. మార్కెట్ ధర ప్రకారం ఆమెకు ఇవ్వాల్సిన 50 వేల రూపాయలను ఇచ్చేశాం. అయితే ఆమె రెండు లక్షలు ఇవ్వలేదంటూ ట్వీట్ చేశారు. నిర్మాతలు ఓ సినిమాను చేయడానికి చాలా కష్టపడి డబ్బులు పోగు చేస్తారు. మా సంస్థపై చాలా సినిమాలు చేశాం. మా సంస్థ కోసం పనిచేసిన వారికి డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం చేయలేదు. అలాగే రేఖ్స్ కోసం మేం లక్ష రూపాయలు ఇస్తామని ఆమె సంప్రదించే ప్రయత్నం చేసినా ఆమె అందుబాటులోని రాలేదు. సింపుల్‌గా ఓ ట్వీట్ ద్వారా ఇతరులు పేరును పాడుచేయడం సులభమే. మా సంస్థలో పనిచేసిన వారికి మేం విలువ ఇస్తాం. కానీ అర్హత లేని మొత్తాన్ని అడిగినంత ఇవ్వలేం'' అన్నారు లైకా ప్రతినిధులు.