తెలంగాణలో క్రాకర్స్ బ్యాన్పై సుప్రీంలో లంచ్ మోషన్ పిటిషన్..
Send us your feedback to audioarticles@vaarta.com
క్రాకర్స్ బ్యాన్పై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ హైకోర్టు తీర్పుపై స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్‌ను బ్యాన్ చేస్తూ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ కోరింది. ఇప్పటికే షాపులలో స్టాకును నింపామని అసోసియేషన్ పిటిషన్లో తెలిపింది. పండుగ రెండు రోజుల ముందు బ్యాన్ విధిస్తే తాము కోట్లల్లో నష్టపోతామని పిటిషనర్ పేర్కొన్నారు.
పెను నష్టాన్ని నివారించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం విధించిన బ్యాన్‌ను ఎత్తివేయాలని సుప్రీంకోర్టును పిటిషనర్ కోరారు. హైకోర్టు తీర్పు వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారని పిటిషనర్ పేర్కొన్నారు. అన్ని అనుమతులు ప్రభుత్వం ఇచ్చి ఇప్పుడు బ్యాన్ అంటే తాము ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు పిటీషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. కాగా.. దీపావళి పండుగపై హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
దీపావళి పండుగలో క్రాకర్స్ పేల్చకుండా ఆదేశాలివ్వాలంటూ ఇంద్ర ప్రకాష్ అనే న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా ఉన్నాయని ఆ సమయంలో క్రాకర్స్ కాల్చడం వలన ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. పండుగ సందర్భంగా టపాసులను బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఇప్పటి వరకూ తెరిచిన షాపులన్నింటినీ మూసి వేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను సైతం జారీ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout