లక్కీ హీరోయిన్ తో రామ్
Send us your feedback to audioarticles@vaarta.com
చాలా గ్యాప్ తర్వాత రామ్‌కు సక్సెస్‌ను అందించిన చిత్రం `నేను శైలజ`. ఈ సినిమాలో రామ్ సరసన శైలజగా నటించి మెప్పించింది హీరోయిన్ కీర్తి సురేష్. ఈ అమ్మడు ఇప్పుడు బిజీ హీరోయిన్గా మారింది. పవన్ కల్యాణ్‌తో సినిమా చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు.
తెలుగు, తమిళంలో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఇప్పుడు మరోసారి రామ్‌తో నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. రామ్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని, దీన్ని దిల్‌రాజు నిర్మిస్తాడని వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ పక్కన కీర్తిసురేష్ నటించనుందట. ఈ సినిమాకు ప్రసన్నకుమార్ మాటలు రాస్తున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments