టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న మంచు విష్ణు 'లక్కున్నోడు'
Send us your feedback to audioarticles@vaarta.com
వెర్సటైల్ యాక్టర్ మంచు విష్ణు, బబ్లీ బ్యూటీ హన్సిక మోత్వాని జంటగా రూపొందుతోన్న ఎంటర్టైనర్ `లక్కున్నోడు`. ఎం.వి.వి.సినిమా బ్యానర్‌పై ఎం.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీపార్ట్‌ను పూర్తి చేసుకుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్‌కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. ఈరోజు ఈ సినిమా టీజర్ విడుదలవుతుంది.
గీతాంజలి, త్రిపుర వంటి హర్రర్ కామెడి చిత్రాలతో మంచి విజయాలను సాధించిన దర్శకుడు రాజ్‌కిరణ్ ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నారు. దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద హిట్స్ తర్వాత మంచు విష్ణు, హన్సిక హ్యాట్రిక్ హిట్ కోసం జత కట్టడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా...
నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ - ``లక్కున్నోడు చిత్రం చాలా చక్కగా వచ్చింది. రెండు సాంగ్స్ మినహా టాకీ పార్ట్ అంతా పూర్తయ్యింది. దర్శకుడు రాజ్ కిరణ్ సినిమాను ఎంటర్టైనింగ్గా తెరకెక్కించారు. మంచు విష్ణు మార్క్ లవ్ అండ్ ఎంటర్‌టైనింగ్‌తో సినిమా అందరినీ అలరిస్తుంది. త్వరలోనే ఆడియో విడుదల చేసి డిసెంబర్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రేపు మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా లక్కున్నోడు టీజర్‌ను విడుదల చేస్తున్నాం`` అన్నారు.
మంచు విష్ణు, హన్సిక, తనికెళ్లభరణి, వెన్నెలకిషోర్, పోసాని కృష్ణమురళి, మురళి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆర్ట్ః చిన్నా, కెమెరాః పి.జి.విందా, మ్యూజిక్ః అచ్చు, ప్రవీణ్ లక్కరాజు, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ః డైమండ్ రత్నబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః విజయ్ కుమార్, ప్రొడ్యూసర్ః ఎం.వి.వి.సత్యనారాయణ, స్టోరీ, దర్శకత్వంం రాజ్‌కిరణ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments