సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణలో 'లక్కున్నోడు'
Send us your feedback to audioarticles@vaarta.com
`ఈడోరకం-ఆడోరకం` వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత విష్ణు మంచు హీరోగా, బబ్లీ బ్యూటీ హన్సిక హీరోయిన్ గా ఎం.వి.వి.సినిమా బ్యానర్‌పై గీతాంజలి, త్రిపుర వంటి హర్రర్ ఎంటర్టైనర్స్ ను తెరకెక్కించిన దర్శకుడు రాజ్ కిరణ్ దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం లక్కున్నోడు. ఈ సినిమా రెండవ షెడ్యూల్ చిత్రీకరణ సోమవారం నుండి ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా...
చిత్ర నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ - ``లవ్ అండ్ కామెడి ఎంటర్ టైనర్ గా రూపొందనున్న మా లక్కున్నోడు చిత్రం మొదటి షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకున్నతొలి షెడ్యూల్లో హీరో ఇంట్రడక్షన్ షాట్, హీరో విష్ణు, హన్సికలపై కీలక సన్నివేశాలను పూర్తి చేశాం. సెకండ్ షెడ్యూల్ సోమవారం నుండి ప్రారంభం అవుతుంది. నవంబర్ వరకు జరిగే ఈ షెడ్యూల్ చిత్రీకరణలో సినిమా మొత్తం పూర్తవుతుంది. దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి సక్సెస్ చిత్రాల తర్వాత విష్ణు, హన్సికల కాంబినేషన్ లో రానున్న హ్యాట్రిక్ మూవీ ఈ లక్కున్నోడు. ఇందులో విష్ణు తనదైన లవ్, కామెడితో ప్రేక్షకులను అలరిస్తారు. డైమంగ్ రత్నబాబు, పి.జి.విందా సినిమాటోగ్రఫీ, అచ్చు సంగీతం సినిమా పెద్ద ప్లస్ అవుతాయి. మంచి టీంతో కలిసి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com