22న యూత్ ని ఆకట్టుకునే 'లవర్స్ క్లబ్' సినిమా టీజర్ లాంచ్
Wednesday, May 17, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రవీణ్ గాలిపల్లి సమర్పణలో, భరత్ అవ్వారి నిర్మాతగా ధృవ శేఖర్ దర్శకత్వంలో అనిష్ చంద్ర, పావని ,ఆర్యన్. పూర్ణి లు జంటగా మెట్టమెదటి సారిగా ఎమెషనల్ లవ్‌స్టోరి గా తెరకెక్కిన చిత్రం లవర్స్‌క్లబ్. ఈ చిత్రాన్ని ప్లాన్ బి` ఎంటర్ టైన్మెంట్స్ యరియు శ్రేయ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యెక్క ప్రీ టీజర్ లాంచ్ 17న రిలీజ్ చేసి 22న టీజర్ లాంచ్ చేయడానికి చిత్రం టీం ప్లాన్ చేస్తున్నారు. పక్కా యూత్‌ఫుల్ ఎమెషనల్ లవ్‌స్టోరిగా యువత ని ఆకట్టుకుంటుంది.
ఈ సందర్బంగా నిర్మాత భరత్ అవ్వారి మాట్లాడుతూ.. 2016 లో పెద్ద చిత్రాలు ఏరేంజి లొ సూపర్‌హిట్స్ అయ్యాయో చిన్న చిత్రాలు అదే రేంజి విజయాలు సాధించాయి. కంటెంట్ ఈజ్ కింగ్ అని ఆడియన్స్ ఫ్రూవ్ చేశారు. చిన్న చిత్రాలు మనుగడకి మార్గం వేశారు. అదే ధైర్యంతో మా లవర్స్ క్లబ్ ని తెరకెక్కించాం. మా కంటెంట్ పక్కా ఎమెషనల్ గా అందరిని ఆకట్టుకుంటుంది. కొత్త వారితో చేసినా మెచ్యురిటి గా మా దర్శకుడు ధృవ శేఖర్ మంచి నటనను రాబట్టుకున్నారు. 22న టీజర్ లాంచ్ చేసి, జూన్ నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అని అన్నారు.
దర్శకుడు ధృవ శేఖర్ మాట్లాడుతూ.. లవర్స్ కి అండగా నిలబడే ఒక యువకుడి జీవితంలో కొన్ని అనుకోని సమస్యలు వస్తే వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర కధాంశం. యదార్ధ సంఘటనలకు ఇన్ స్ఫైర్ అయ్యి ఈ చిత్రాన్ని తెరకేక్కించాం. వినోదాత్మకంగా ఎమెషనల్ గా చిత్ర కథాంశాన్ని ఎంచుకున్నాం. అనుకున్నది అనుకున్నట్టుకుగా తెరకెక్కించాం. పక్కాకమర్షియల్ ఎలిమెంట్స్ వున్న చిత్రం లవర్స్ క్లబ్, యూనిట్ మెత్తం చాలా కష్టపడి ఇష్టపడి చేశాము. యూత్ ఫుల్ టీం కావటంతో అందరు చాలా ఎనర్జిగా పనిచేశారు. స్క్రీన్ మీద కూడా అదే ఎనర్జి కనపడుతుంది. టీజర్ తో పాటు సినిమా కూడా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాము అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments