న‌వంబ‌ర్ 17న విడుద‌ల కానున్నల‌వ‌ర్స్ క్ల‌బ్

  • IndiaGlitz, [Monday,November 06 2017]

ప్రవీణ్ గాలిపల్లి సమర్పణ‌లో, భరత్ అవ్వారి నిర్మాత‌గా ధృవ శేఖ‌ర్ దర్శకత్వంలో అనిష్ చంద్ర‌, పావ‌ని ,ఆర్య‌న్‌. పూర్ణి లు జంట‌గా మెట్ట‌మెద‌టి సారిగా ఎమెష‌న‌ల్ ల‌వ్‌స్టోరి గా తెర‌కెక్కిన చిత్రం ల‌వ‌ర్స్‌క్ల‌బ్‌. ఈ చిత్రాన్ని ప్లాన్ 'బి' ఎంటర్ టైన్మెంట్స్ యరియు శ్రేయ ఆర్ట్ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై సంయుక్తంగా నిర్మించారు.

ఈ చిత్రం యెక్క టీజ‌ర్‌, స్టిల్స్‌, ట్రైల‌ర్‌ ఇప్ప‌టికే టాక్ ఆఫ్ ద యూత్ కాగా , ప‌క్కా యూత్‌ఫుల్ ఎమెష‌న‌ల్ ల‌వ్‌స్టోరిగా యువ‌త ని ఆక‌ట్టుకునేలా రూపోందిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 17న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

ఈ సంద‌ర్బంగా నిర్మాత భ‌ర‌త్ అవ్వారి మాట్లాడుతూ.. 2017 లో పెద్ద చిత్రాలు ఏరేంజి లొ సూప‌ర్‌హిట్స్ అయ్యాయో చిన్న చిత్రాలు అదే రేంజి విజ‌యాలు సాధించాయి. కంటెంట్ ఈజ్ కింగ్ అని ఆడియ‌న్స్ ఫ్రూవ్ చేశారు. చిన్న చిత్రాలు మ‌నుగ‌డ‌కి మార్గం వేశారు. అదే ధైర్యంతో మా ల‌వ‌ర్స్ క్ల‌బ్ ని న‌వంబ‌ర్ 17న‌ విడుద‌ల చేస్తున్నాం. మా కంటెంట్ ప‌క్కా ఎమెష‌నల్ గా అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. కొత్త వారితో చేసినా మెచ్యురిటి గా మా ద‌ర్శ‌కుడు ధృవ శేఖ‌ర్ అంద‌రితో పెర్‌ఫార్మ్‌న్స్ ని రాబ‌ట్టుకున్నారు.. అని అన్నారు.

ద‌ర్శ‌కుడు ధృవ శేఖ‌ర్ మాట్లాడుతూ.. ల‌వ‌ర్స్ కి అండ‌గా నిల‌బ‌డే ఒక యువకుడి జీవితంలో కొన్ని అనుకోని సమస్యలు వస్తే వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర కధాంశం. యదార్ధ సంఘటనలకు ఇన్స్పిర్ అయ్యి ఈ చిత్రాన్ని తెరకేక్కించాం. ఫ‌స్ట్ టై ఐ ఫోన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ చిత్రాన్ని తెరకేక్కించాం. ఇంతవరకు ఎవరు తీయని విధంగా ఈ టెక్నాలజీతో మేము తీసాం. ఈ టెక్నిక్ ఇండస్ట్రీ వాళ్ళని, యూత్ ని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం.

వినోదాత్మ‌కంగా ఎమెష‌నల్ గా చిత్ర క‌థాంశాన్ని ఎంచుకున్నాం. అనుకున్న‌ది అనుకున్న‌ట్టుకుగా తెర‌కెక్కించాం. ప‌క్కాక‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ వున్న చిత్రం ల‌వ‌ర్స్ క్ల‌బ్, యూనిట్ మెత్తం చాలా క‌ష్ట‌ప‌డి ఇష్ట‌ప‌డి చేశాము.. మా చిత్రం అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుందని ఆశిస్తున్నాము. న‌వంబ‌ర్ 17న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నాము .. అని అన్నారు.