యూత్ ని ఆకట్టుకునే 'లవర్స్ క్లబ్' ఫస్ట్ లుక్

  • IndiaGlitz, [Monday,January 09 2017]

ప్రవీణ్ గాలిపల్లి సమర్పణ‌లో, భరత్ అవ్వారి నిర్మాత‌గా ధృవ శేఖ‌ర్ దర్శకత్వంలో అనిష్ చంద్ర‌, పావ‌ని ,ఆర్య‌న్‌. పూర్ణి లు జంట‌గా మెట్ట‌మెద‌టి సారిగా ఎమెష‌న‌ల్ ల‌వ్‌స్టోరి గా తెర‌కెక్కిన చిత్రం ల‌వ‌ర్స్‌క్ల‌బ్‌. ఈ చిత్రాన్ని ప్లాన్ బి' ఎంటర్ టైన్మెంట్స్ యరియు శ్రేయ ఆర్ట్ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యెక్క ప్రీలుక్ ఇప్ప‌టికే టాక్ ఆఫ్ ద యూత్ కాగా, ఇప్ప‌డు ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేస్తున్నాము. సంక్రాంతి త‌రువాత ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ని విడుదల చేస్తారు. ప‌క్కా యూత్‌ఫుల్ ఎమెష‌న‌ల్ ల‌వ్‌స్టోరిగా యువ‌త ని ఆక‌ట్టుకుంటుంది.
ఈ సంద‌ర్బంగా నిర్మాత భ‌ర‌త్ అవ్వారి మాట్లాడుతూ.. 2016 లో పెద్ద చిత్రాలు ఏరేంజి లొ సూప‌ర్‌హిట్స్ అయ్యాయో చిన్న చిత్రాలు అదే రేంజి విజ‌యాలు సాధించాయి. కంటెంట్ ఈజ్ కింగ్ అని ఆడియ‌న్స్ ఫ్రూవ్ చేశారు. చిన్న చిత్రాలు మ‌నుగ‌డ‌కి మార్గం వేశారు. అదే ధైర్యంతో మా ల‌వ‌ర్స్ క్ల‌బ్ ని తెర‌కెక్కించాం. మా కంటెంట్ ప‌క్కా ఎమెష‌నల్ గా అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. కొత్త వారితో చేసినా మెచ్యురిటి గా మా ద‌ర్శ‌కుడు ధృవ శేఖ‌ర్ పర్ఫోర్మన్సుస్ రాబట్టుకున్నారు. సంక్రాంతి త‌రువాత మా ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ చూసిన ప్ర‌తి ఆడియ‌న్ ఈ మాట చెప్తారు. ఇటీవ‌లే ప్రీలుక్ అని విడుదల చేసిన మా పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో స‌న్సేష‌న్ అయ్యింది. ఇప్ప‌డు మా ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేస్తున్నాము. ఆడియో ని ఫిబ్ర‌వ‌రి లో విడుదల చేసి అదే నెల‌లో చిత్రాన్ని విడుదల చేయ్య‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము. ప్ర‌స్తుతం షూటింగ్ కార్క‌క్ర‌మాలూ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. అని అన్నారు.
ద‌ర్శ‌కుడు ధృవ శేఖ‌ర్ మాట్లాడుతూ.. ల‌వ‌ర్స్ కి అండ‌గా నిల‌బ‌డే ఒక యువకుడి జీవితంలో కొన్ని అనుకోని సమస్యలు వస్తే వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర కధాంశం. యదార్ధ సంఘటనలకు ఇన్స్పిర్ అయ్యి ఈ చిత్రాన్ని తెరకేక్కించాం. ఒక కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఈ చిత్రాన్ని తెరకేక్కించాం. ఇంతవరకు ఎవరు తీయని విధంగా ఈ టెక్నాలజీతో మేము తీసాం. ఈ టెక్నిక్ ఇండస్ట్రీ వాళ్ళని, యూత్ ని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం. వినోదాత్మ‌కంగా ఎమెష‌నల్ గా చిత్ర క‌థాంశాన్ని ఎంచుకున్నాం. అనుకున్న‌ది అనుకున్న‌ట్టుకుగా తెర‌కెక్కించాం. ప‌క్కాక‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ వున్న చిత్రం ల‌వ‌ర్స్ క్ల‌బ్, యూనిట్ మెత్తం చాలా క‌ష్ట‌ప‌డి ఇష్ట‌ప‌డి చేశాము.యూత్ ఫుల్ టీం కావ‌టంతో అందరు చాలా ఎన‌ర్జిగా ప‌నిచేశారు. స్క్రీన్ మీద కూడా అదే ఎనర్జి క‌న‌ప‌డుతుంది. మా ఫ‌స్ట్ లుక్ అందిరిని ఆక‌ట్టుకుంటుందని ఆశిస్తున్నాము. ఫిబ్ర‌వ‌రి లొ విడుద‌ల చేయ‌నున్నాము .. అని అన్నారు.

More News

ఆ వ్యాఖ్య‌లు నేను ప‌ట్టించుకోను...వాళ్ల విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తాను - చిరంజీవి

చిరు పాత్ర‌ల‌తో న‌ట ప్ర‌స్ధానం ప్రారంభించి...సామాన్య స్ధాయి నుంచి అసామాన్య స్ధాయికి ఎదిగి..త‌నో శ‌క్తిగా ఎదిగి ప్రేక్ష‌క హృద‌యాల్లో చిరంజీవిగా సుస్ధిర స్ధానం సంపాదించుకుని హీరోల‌కే హీరో అయిన స్టార్ మెగాస్టార్ చిరంజీవి...!

బన్ని మూవీకి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్టయ్యింది...

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్,దిల్ రాజు,హరీష్ శంకర్,దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం 'డిజె..దువ్వాడ జగన్నాథమ్'.

నా బాద్యతగా ఫీలయ్యాను - బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో క్రిష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం'గౌతమిపుత్ర శాతకర్ణి'.

రాఘవేంద్రరావు గారు ఇదే ఆఖరి సినిమా అంటున్నారు... మనంలా ఓం నమో వేంకటేశాయ క్లాసిక్ గా నిలవాలి - నాగార్జున

నవరస సమ్రాట్ నాగార్జున,దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందుతున్న నాలుగ వ భక్తిర స చిత్రం ఓం నమో వేంకటేశాయ.

వైరస్ ఫస్ట్ లుక్ రిలీజ్

తక్కువ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు మూవీ 'వైరస్'