టైటిల్ మారింది...!

  • IndiaGlitz, [Wednesday,September 19 2018]

బావ మ‌రిది ఆయుశ్ శ‌ర్మ‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ నిర్మించిన చిత్రం ' ల‌వ్‌రాత్రి'.అయితే ప్రారంభం నుండి కొన్ని హిందూ సంఘాలు ఈ టైటిల్‌ను మార్చ‌మ‌ని ఆందోళ‌న చేస్తున్నాయి. దేవీ న‌వ‌రాత్రుల‌ను అవ‌మాన ప‌రిచేలా టైటిల్ ఉంద‌ని హిందూ సంఘాలు ఆరోప‌ణ‌.

దీంతో మ‌న‌సు మార్చుకున్న స‌ల్మాన్ ఖాన్ ల‌వ్ రాత్రిని కాస్త ల‌వ్ యాత్రిగా మారుస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేస్తూ ట్వీట్ కూడా చేశాడు. దేవీ న‌వ రాత్రుల స‌మ‌యంలో హీరో, హీరోయిన్ మ‌ధ్య ప్రేమ ఎలా చిగురించింద‌నేదే క‌థ‌. అభిరాజ్ మీనావాలా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ఆయుష్ స‌ర‌స‌న హుస్సేన్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రం అక్టోబ‌ర్ 5న విడుద‌ల‌వుతుంది.