50 ఓట్లు కూడా రావన్నావ్.. లవ్ యూ శివాజీ!
Send us your feedback to audioarticles@vaarta.com
"మిత్రమా శివాజీ.. నాకు 50 ఓట్లు కూడా రావు అని అన్నావ్.. నువ్వు జీవితంలో ప్రెసిడెంట్ కావు అన్నావ్(ఓపెన్‌గా మాట్లాడుతున్నా) ఇవాళ 70 ఓట్ల మెజార్టీతో నేను గెలిచాను. జీవితా అంతకాన్నా ఎక్కువ మెజార్టీతో గెలిచారు. రాజశేఖర్ ఇలా అన్ని ప్యానెల్ మెంబర్స్ గెలిచారు" అని నరేశ్ ఒకింత ఆవేదనకు లోనయ్యారు. అందరూ గెలిచారని మేమంతా ఒక్కటేనని ఆయన చెప్పుకొచ్చారు. గెలుపు అనంతరం మీడియాతో మాట్లాడిన నరేశ్.. శివాజీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
లవ్ యూ శివాజీ..
మిత్రమా శివాజీ.. ఎప్పుడూ నీతోనే ఉంటా.. నేను గతం అంతా మరిచిపోతున్నా.. కలిసి పని చేద్దాం రండి. ఇవాళ నువ్వేం చేశావ్ అని అడిగినందుకు ప్రజలు గెలిపించినటువంటి విజయమిది. నేనేం చేశానో ప్రజలకు తెలుసు.శివాజీ లవ్ యూ.. నీ మీద ఎలాంటి శత్రుత్వం లేదు. పాత గొడవలన్నీ పక్కనపెట్టేద్దాం. ఇండస్ట్రీ అంతా మనతోనే ఉంది. నేను ఏమైనా తప్పుగా అనుంటే క్షమించండి. ‘మా’లో ఒక మార్పు కోసం కలిసి పనిచేద్దాం. ఎవరైతే ఓడారో... గెలిచారో అందరూ నా దగ్గరికి రండి కలిసి పనిచేద్దాం.
యూత్, మహిళా కమిటీలు ఏర్పాటు!
"మా బావ రాజశేఖర్, జీవిత మేమంత కలిసి పనిచేసి ఒక మంచి టెర్మ్‌ను ఇవ్వడంతోపాటు మంచి లీడర్షిప్ను అందిస్తాం. అమ్మా సాక్షిగా చెబుతున్నా.. ఈ ఒక్క టెర్మ్ మాత్రమే అధ్యక్షుడిగా పనిచేస్తాను అంతే. నేను మళ్లీ మళ్లీ పోటీ చేయను.. కోరను అంతే. కానీ మీకు మంచి లీడర్షిప్ను అందించే వెళ్తాను" అని నరేశ్ చెప్పారు. సినీ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైమ్.. యూత్ కమిటీ, మహిళా కమిటీలు ఏర్పాటు చేయబోతున్నామని నరేశ్ చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments