ఆకట్టుకుంటున్న‘లవ్ స్టోరీ’ టీజర్.. అంచనాలను భారీగా పెంచేశారు..
Send us your feedback to audioarticles@vaarta.com
అందమైన లవ్ స్టోరీలను మరింత అందంగా సున్నితమైన భావోద్వేగాలను జత చేసి అందించడంలో దిట్ట శేఖర్ కమ్ముల. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా.. ఆకట్టుకునే కథతో సింపుల్ అండ్ స్వీట్‌గా శేఖర్ కమ్ముల అందిస్తారు. గోదావరి, హ్యాపీ డేస్, ఫిదా వంటి బ్లాక్ బస్టర్స్‌ను ప్రేక్షకులకు అందజేసిన ఆయన ప్రస్తుతం మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా ‘లవ్ స్టోరీ’ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను నేడు విడుదల చేశారు.
నాగచైతన్య వర్కవుట్స్ చేయించే సీన్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. సాయిపల్లవి పరిచయం.. తరువాత వీరి ప్రేమ.. అంశాలను ముఖ్యంగా చూపించారు. నాగచైతన్య, సాయిపల్లవిల ప్రేమలో చాలా ఫీల్‌తో ఉన్నట్టు కనిపిస్తుంది. కెరీర్లో ఎదగాలనుకునే ఓ యువ జంట మధ్య తలెత్తిన ప్రేమ.. పెద్దలను ఎదిరించలేక.. తమ ప్రేమను కాపాడుకునేందుకు పారిపోయే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. మంచి లవ్ అండ్ ఎంటర్టైనర్గా శేఖర్ కమ్ముల ఈసినిమాను తెరకెక్కించినట్టు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది.
మొత్తంగా టీజర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. శేఖర్ కమ్ముల నుంచి మరో భారీ హిట్ ఖాయంగా కనిపిస్తోంది. అలాగే నాగ చైతన్య కెరీర్‌కు ఈ సినిమా చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. త్వరలోనే ‘లవ్ స్టోరీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com