ప్రేమికుల రోజున 'లవ్ స్టోరి' మ్యూజికల్ ప్రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘‘లవ్ స్టోరీ’’.సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.
సంక్రాంతి పండగ రోజు ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్న టీమ్ ఇప్పుడు ప్రేమికుల రోజున మరో సర్ ప్రైజ్ తో రాబోతుంది.మ్యూజికల్ లవ్ స్టోరీగా రాబోతున్న లవ్ స్టోరీ నుండి 1 మినిట్ ‘‘మ్యూజికల్ ప్రివ్యూ’’ రిలీజ్ చేయబోతున్నారు..అంటే ఫిబ్రవరి 14న ఉదయం 11గం.07 ని లకు సినిమాలోని మొదటి పాట ‘‘ఏయ్ పిల్లా’’ అనే సాంగ్ ప్రివ్యూ ని రిలీజ్ చేయబోతుంది. ఎ.ఆర్ రెహామాన్ స్కూల్ నుండి పరిచయం అవుతున్న పవన్ సి.హెచ్ అందించిన స్వరాలు ఈ లవ్ స్టోరీని మరింత అందంగా మార్చబోతున్నాయని టీం చెబుతుంది.
ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమకథ అక్కినేని అభిమనుల్లో, ప్రేక్షకుల్లో అమితాసక్తిని కలిగించింది.సునిశితమైన భావోద్వేగాలను బలంగా తెరమీద పలికించగల విజనరీ ఉన్న శేఖర్ కమ్ముల అందించబోతున్న ఈ ప్రేమకథ సమ్మర్ కి స్సెషల్ ఎట్రాక్షన్గా మారబోతుంది. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలుపోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com