‘లవ్ స్టోరీ’కి ఓవర్సీస్ ప్రేక్షకులు ఫిదా.. యూఎస్ ప్రీమియర్స్‌లో సరికొత్త రికార్డ్..!!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వైరస్ కారణంగా తీవ్రమైన ప్రభావితమైన రంగాల్లో సినీ పరిశ్రమ కూడా ఒకటి. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ప్రతి ఇండస్ట్రీ కోవిడ్‌తో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది.షూటింగ్స్ నిలిచిపోవడం, పలువురు సినీ ప్రముఖులు వైరస్ సోకి మరణించడం, కరోనా నేపథ్యంలో సినిమా రిలీజ్ చేసినా .. థియేటర్స్ కు ప్రేక్షకులు వస్తారో రారో అనే ఆలోచనలు .. ఇవన్నీ కలిసి చిన్నా, పెద్ద సినిమాలను రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ థియేటర్స్ వైపు కంటే.. ఓటీటీల వైపే చూస్తున్న వేళ నాగచైతన్య - సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. టీజర్, ట్రైలర్‌లతో పాటు అమీర్‌ఖాన్, చిరంజీవి పాల్గొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో రిలీజ్ అయిన లవ్ స్టోరీ కచ్చితంగా ప్రేక్షకులను థియేటర్స్ వైపు నడిపించడంలోనూ సక్సెస్ అయ్యిందని సినీ పండితులు అంటున్నారు.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పటి వరకూ ఏ సినిమాకు రాని విధంగా ప్రేక్షకులను థియేటర్స్ వద్దకు రప్పించింది ఈ సినిమా. లవ్ స్టోరీ కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నేపథ్యంలో శుక్రవారం(సెప్టెంబర్ 24) థియేటర్స్ లో రిలీజ్ అయింది. అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు థియేటర్స్ వద్దకు క్యూ కట్టారు. తెలుగు రాష్ట్రాలే కాదు, ఓవర్‌సీస్‌లోనూ ‘లవ్ స్టోరీ’కి మంచి ఆదరణ లభించింది.
అమెరికాలో లవ్ స్టోరీ ప్రీమియర్ షోలకు ప్రేక్షకులు క్యూ కట్టడం విశేషం. అమెరికాలో 224 లొకేషన్స్‌లో లవ్‌స్టోరి ప్రీమియర్స్ వేస్తే, 3,07,103 డాలర్స్ వచ్చాయి. ఇక తొలిరోజు 2,34,000 డాలర్స్ వసూళ్లను సాధించింది. ప్రీమియర్స్‌తో కలుపుకుని మొత్తంగా 540000 డాలర్స్ ఈ సినిమాకు వచ్చింది. అంటే మొత్తంగా రూ.4.40కోట్ల రూపాయలు వచ్చాయి. తద్వారా కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారీ ఓపినింగ్స్ రాబట్టిన సినిమాగా లవ్‌స్టోరీ నిలిచింది. అంతేకాదు.. సినిమాలు రిలీజ్ చేయాలా వద్దా అని భయాందోళనలో వున్న నిర్మాతలకు లవ్ స్టోరీ కలెక్షన్లు ఊపిరినిచ్చిందని చెప్పవచ్చు.
ఈ సినిమా టోటల్ థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే.. నైజాంలో 250 వరకు థియేటర్స్ లో విడుదలవ్వగా... ఆంధ్రలో 400 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో లవ్ స్టోరి 650 వరకు థియేటర్స్ రిలీజ్ అయ్యిందని తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా కి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. సినిమాకి మొత్తం మీద 31.2 కోట్ల బిజినెస్ సొంతం అవ్వగా సినిమా ఇప్పుడు 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com