ఒకింటివార‌వుతున్న ప్రేమ జంట‌...

  • IndiaGlitz, [Thursday,June 21 2018]

బాలీవుడ్ స్టార్స్ ప్రేమ ప‌క్షుల విహార‌యాత్ర‌లు చేస్తుంటారు. కానీ పెళ్లి చేసుకునే వారు మాత్రం త‌క్కువ మందే ఉంటారు. అలా పెళ్లి చేసుకుని ఒకింటివారు కాబోతున్నారు ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొనే. చాలా కాలంగా ప్రేమ వ్య‌వ‌హారం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నార‌ని వార్త‌లు చాలా కాలంగా విన‌ప‌డుతూ వ‌స్తున్నాయి.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ ఏడాదినే ఈ జంట ఒక్క‌టి కానుంది. ఈ న‌వంబ‌ర్ 20న వీరి వివాహం జ‌ర‌ప‌డానికి ఇరు కుటుంబాలు పెద్ద‌లు నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. అలాగే ఉద‌య‌పూర్ ప్యాలెస్‌లో వీరి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని కూడా న్యూస్ విన‌ప‌డుతుంది. అయితే దీనిపై ర‌ణ‌వీర్‌, దీపికా స‌హా ఇరు కుటుంబాల‌కు సంబంధించిన వారెవ‌రూ స్పందించ‌డం లేదు. కొన్ని రోజులు ఆగితే నిజా నిజాలు తెలియ‌నుంది.