'లవ్,లైఫ్ అండ్ పకోడి' ఫస్ట్ లుక్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
కలర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్ బ్యానర్ పై మధురా శ్రీధర్ రెడ్డి సమర్పణ లో రూపొందిన చిత్రం "లవ్ లైఫ్ అండ్ పకోడి" జయంత్ గాలి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్ కి సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తుంది. కార్తిక్ , సంచిత హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు.ఈ మూవీ ఫస్ట్ లుక్ లోవీరి ఫోజ్ రోటీన్ లుక్స్ భిన్నంగా ఉంటూ సినిమా పై ఆసక్తిని కలిగించింది. ఒక రిలేషన్ కి కమిట్అయ్యేందుకు కన ఫ్యూజ్
అయ్యే జంట కు వారి మద్య ప్రేమే సమస్యగా ఎలా మారుతుంది అనేది ఆసక్తిగా తెరమీదకు కనువిందు చేయబోతుంది.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత జయంత్ గాలి మాట్లాడుతూః ఈ జనరేషన్ ఏ రిలేషన్ కయినా కమిట్ అవడానికి భయపడతారు.కన్ ఫ్యూజ్ అవుతారు..కరెక్టా కాదా అనే సందేహాలలో పడిపోతారు.వారి మద్య ఆకర్షణలు, ప్రేమలు ఉంటాయి. కానీ వారి బాండింగ్ కి ఎలాంటి రిలేషన్ తో ముడి పెడతానికి ఇష్టపడరు.. అదే మా ప్రేమ కథ. మోడ్రన్ కల్చర్ లో నేటి జనరేషన్ లివింగ్ స్టెయిల్ ని ప్రతి బింబించే ఈ కథ తప్పకుండా యూత్ కి కనెక్ట్ అవుతుందనే నమ్మకం మాకు ఉంది.ఈ రోజు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి చాలా మంచి రెస్సాన్స్ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తయ్యాయి.థియేటర్స్ కి అనుమతులు లభించగానే రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటాం.అన్నారు. కార్తిక్ బిమల్ రెబ్బ , సంచిత పొనాచ, జంటగా నటిస్తున్న ఈచిత్రంలో ఆకర్ష్ రాజ్ భాగవతుల, క్రిష్ణ హాబ్బల్ , కళా జ్యోతి , అనురాధ మల్లికార్జున ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com