చక్కటి దృశ్యకావ్యం లవ్ కె రన్ - సి.కళ్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ అంశాలతో రూపొందిన చక్కటి ప్రేమకావ్యం లవ్ కె రన్ చిత్రం అని చిత్ర సమర్పకుడు సి.కళ్యాణ్ తెలియచేసారు. లెజెండ్ చిత్రంలో చిన్నప్పటి బాలకృష్ణగా నటించడంతో పాటు ఆస్కార్ కి నామినేట్ అయిన మిణుగురులు చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన దీపక్ సరోజ్ హీరోగా మలయాళంలో ఘన విజయం సాధించిన 916 చిత్రంలో హీరోయిన్ గా నటించిన మాళవిక మీనన్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ లవ్ కె రన్ చిత్రాన్ని రూపొందించారు. కోటపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రానికి సేవ్ ద లవ్ అనేది ఉప శీర్షిక. కందిమల మూవీ మేకర్స్ బ్యానర్ పై కందిమల్ల వెంకట్ చంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమౌతుంది. ఈ చిత్రం ట్రైలర్ ను ప్రసాద్ ల్యాబ్స్ లో సి.కళ్యాణ్ రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు సి.కళ్యాణ్ మాట్లాడుతూ...అనుకోకుండా ఈ చిత్రాన్ని చూసాను. సాంకేతిక విలువలతో పాటు ఈ చిత్రం కూడా బాగా ఆకట్టుకుంది.
దాంతో బయ్యరును కావడంతో పాటు సమర్పకుడిగా మారి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాను. బాలనటుడిగా రాణించిన దీపక్ సరోజ్ ఇప్పుడు హీరోగా పరిచయం అవుతూ తొలి చిత్రంలోనే చక్కని నటనను ప్రదర్శించాడు. ప్రేమకథలు ఎప్పుడూ సక్సెస్ సంకేతాలే. వైవిధ్యభరితంగా తెరకెక్కిన ఈ చిత్రం కూడా తప్పకుండా అలరిస్తుందన్న నమ్మకం ఉంది. అలాగే పాటలు కూడా బాగుండడం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు.
డైరెక్టర్ కోటపాటి శ్రీను మాట్లాడుతూ...ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం ఒక కోణమైతే...ప్రేమించుకుని విడిపోయి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం మరో కోణం. ఈ రెండూ కాకుండా ప్రేమలోని మూడో కోణాన్ని ఆవిష్కరిస్తూ ఈ చిత్రం రూపొందించాం. ప్రేమికులకు సమస్యలు ఎదురైనప్పుడు తిరిగి పుంజుకునే శక్తి కోసం ఎలక్ర్టాల్ పౌడర్ తాగాలే కానీ...ప్రాణాలు తీసే ఎండ్రేన్ తాగకూడదు అని ఈ చిత్రంలో చెబుతున్నాం. ఆరోగ్యం కోసం 2 కె రన్ ఎలా చేస్తుంటారో అలాగే ప్రేమ కోసం పరుగే ఈ చిత్రం అన్నారు.
నిర్మాత కందిమల్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ...దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఈ చిత్రాన్ని నిర్మించాం. మేము అనుకున్నట్లుగా ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. ఆగష్టులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
ఈ కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ...సాంగ్స్ & ట్రైలర్స్ చాలా బాగున్నాయి. ఈ చిత్రంలో సి. కళ్యాణ్ గారు భాగస్వామ్యమై విడుదల చేయబోతుండడంతో మూవీ పై క్రేజ్ పెరిగింది అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ లు వినాయకరావు, ప్రభు, గీత రచయిత కాసర్ల శ్యామ్, మాటల రచయిత సుధాకర్, జబర్ధస్త్ మూర్తి, రాకేష్, ఎడిటర్ మేనగ శ్రీను తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని కాంక్షిస్తూ ప్రసంగించారు.
కృష్ణభగవాన్, వినోద్ కుమార్, సత్యప్రకాష్, తాగుబోతు రమేష్, హేమ, రచ్చ రవి, సన, మాధవి, రాకేష్, రవికిరణ్, జయంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు - స్వర్ణ సుధాకర్, గుత్తి మల్లిఖార్జున్, పాటలు - కాసర్ల శ్యామ్, జిల్లెల ప్రసాద్, సంగీతం - జె.పి, కెమెరా - సూర్య, ఎడిటింగ్ - మేనగ శ్రీను, డ్యాన్స్ - స్వర్ణ, రేఖ, స్టంట్స్ - నందు, ఆర్ట్ - భాస్కర్, సమర్పణ - సి.కళ్యాణ్, నిర్మాత - కందిమల్ల వెంకట చంద్రశేఖర్, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - కోటపాటి శ్రీను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout