పాన్ ఇండియా గా రా బోతున్న లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ 'ది గార్డ్ 2020'

  • IndiaGlitz, [Monday,May 09 2022]

వీరాజ్ రెడ్డి చేలం హీరోగా, జగ పెద్ది దర్శకత్వంలో, అనసూయ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం గార్డ్ 2020. ఈ సినిమా మొత్తం విదేశాల్లో నిర్మిస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా. అలాగే ఇది కేవలం పాన్ ఇండియానే కాకుండా పాన్ వరల్డ్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీనిని పూర్తిగా మెల్‌బోర్న్‌లో హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో చిత్రీకరించారు.

ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేసే సన్నివేశాలతో అద్భుతమైన టెక్నోలజీతో పూర్తిస్థాయి థ్రిల్లర్ సినిమాగా చిత్రీకరించారు. ఈ సినిమాను కేవలం భారతీయ భాషల్లో మాత్రమే కాకుండా ఇంగ్లీష్, చైనీస్ భాషలలో కూడా విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ మార్క్ కెనిఫిల్డ్ చాలా చక్కటి విజువల్స్ తో పాటు అత్యాధునిక టెక్నలాజిని ఈ సినిమాలో వాడి ప్రేక్షకులను అబ్బురపరిచే సన్నివేశాలను చిత్రీకరించారు. స్టంట్ డైరెక్టర్ పువెన్ పాంథర్ ఈ సినిమాకు తన నైపుణ్యంతో ప్రేక్షకులను కట్టిపడేసే స్టంట్స్ తో అత్యంత సహసవంతమైన పోరాట సన్నివేశాలను కంపోజ్ చేశారు. అలాగే ఈ సినిమాకు వీఎఫ్ ఎక్స్ చాలా కీలకం. దీనికి గాను షే శాలిత్ హాలీవుడ్ సినిమాలో వాడే కొత్త టెక్నలాజిని వాడి సినిమాని మరో మెట్టుకు తీసుకెళ్లారు.

ఈ సినిమాకి ఎడిటర్ గా గర్రి బీహెచ్ పనిచేశారు. ఈ సినిమాని డైరెక్టర్ విజన్ లో ఎడిట్ చేసి ప్రేక్షకులకు కళ్ళముందు ఒక అద్భుతాన్ని అవిష్కరించనున్నారు. ఇలాంటి అసాధారణమైన యూనిట్ ఈ చిత్రానికి పనిచేశారు కాబట్టే, సినిమాలో ప్రతీ సన్నివేశం అంత అద్భుతంగా వచ్చిందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అలాగే ఈ మధ్య విడుదలైన గార్డ్ 2020 ఫస్ట్ లుక్ ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఒక సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చి ఇంత పెద్ద సినిమాను తెరకెక్కిస్తున్నారంటే అది కేవలం సినిమాపై హీరో వీరాజ్ రెడ్డికి ఉన్న ఇష్టమే అని చెప్పవచ్చు. ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. అలాగే దర్శకుడు జగ పెద్ది ఈ సినిమాకోసం అహర్నిశలు పనిచేసి, ప్రేక్షకుల కోసం ఓ భారీ బడ్జెట్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ని సిద్ధం చేశారు. ఇదివరకే ఆయన తీసిన సినిమాలకు ఎన్నో ప్రతిష్టమైన అవార్డ్స్ పొందారు. ఇక సినిమా మొత్తం చాలా బాగవచిందని ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు.