నేలకొరిగిన మేరునగ దర్శకధీరుడు దాసరి....

  • IndiaGlitz, [Tuesday,May 30 2017]

డా.దాస‌రి నారాయ‌ణ‌రావు..ఓ గురువు....దిశానిర్ధేశ‌కుడు...మారుతున్న ధోర‌ణుల్లో త‌ప్పొప్పుల‌ను నిర్భ‌యంగా చెప్పే మార్గ‌దర్శ‌కుడు..అమ్మ‌లా అన్నం పెట్టి, నాన్న‌లా స‌మ‌స్య‌కు ముందు నిల‌బ‌డిన పెద్ద‌మ‌నిషి ఇప్పుడు లేడు. ఇక సెల‌వంటూ వీడ్కోలు తీసుకుని అంబరాన్ని చేరారు. స‌గ‌టు సినీ ప్రేక్ష‌కుడికి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. 50 ఏళ్ళ సినీ ప్ర‌స్థానంలో 40 ఏళ్ళు ద‌ర్శ‌కుడిగా తెలుగు సినిమాపై త‌న‌దైన సంత‌కం చేశారు. ఇప్పుడున్న సీనియ‌ర్ ద‌ర్శ‌కుల‌కేంద‌రికో గురువు. ఇప్ప‌టి ద‌ర్శ‌కుల‌కు గుగ్గురువు. సామాన్య రైతు కుటంబంలో పుట్టి, పార్ల‌మెంట్ మెంబ‌ర్ స్థాయికి ఎదిగిన అసామాన్యుడు. నాట‌క‌రంగం నుండి సినీ రంగంలోకి అడుగుపెట్టిన దాస‌రి తాత మ‌న‌వ‌డితో ద‌ర్శ‌కుడిగా మారారు. క‌థ‌నే న‌మ్ముకుని సినిమాల‌ను తెర‌కెక్కించి ద‌ర్శ‌కుడిగా త‌నెంటో ప్రూవ్ చేయ‌డ‌మే కాకుండా ఏ సినిమాకైనా కెప్టెన్ ద‌ర్శ‌కుడే అని చాటి చెప్పిన ఘ‌న‌త దాస‌రికే సొంతం అందుకే ఒక‌టి కాదు, రెండు కాదు ఏకంగా 151 సినిమాల‌ను డైరెక్ట్ చేసి ప్ర‌పంచంలో ఏ ద‌ర్శ‌కుడు సాధించ‌లేని క్రెడిట్‌ను సొంతం చేసుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును క్రియేట్ చేశారు.

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌,కృష్ణ‌, శోభ‌న్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాల‌కృష్ణ‌, మోహ‌న్‌బాబు, నాగార్జున, వెంక‌టేష్ ఇలా అంద‌రి హీరోల‌తో తిరుగులేని సినిమాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు. సినిమా స్పాట్‌లోనే అద్భుత‌మైన స‌న్నివేశాల‌ను సృష్టించి భారీ విజ‌యాల‌ను క‌ట్ట‌బెట్టిన సృష్టిక‌ర్త‌. ఎన్టీఆర్ సినీ, రాజ‌కీయ జీవితాన్ని మ‌లుపు తిప్పిన చిత్రాల‌కు దాస‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం విశేషం.

ద‌ర్శ‌కుడిగా 151 చిత్రాల‌ను తెర‌కెక్కించిన దాస‌రి నిర్మాత‌గా 53 చిత్రాల‌ను నిర్మించారు. 250 చిత్రాల‌కు పైగా పాట‌లు, మాట‌లు అందించారు. మామ‌గారు, సూరిగాడు, అమ్మ రాజీనామా, ఒసేయ్ రాముల‌మ్మ‌, మేస్త్రి, ఎర్ర‌బ‌స్సు వంటి చిత్రాల్లో దాస‌రి త‌న న‌ట‌నా కౌశలాన్ని ప్ర‌ధర్శించారు. రెండు నేష‌న‌ల్ అవార్డ్స్‌, తొమ్మిది నంది అవార్డులు, ఆరు ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకున్నారు దాస‌రి.

సినీరంగానికి చేసిన ఉత్త‌మ సేవ‌ల‌కుగానూ 1986లో ఆంధ్రా విశ్వ‌విద్యాల‌యం ఆయ‌న్ను క‌ళాప్ర‌పూర్ణ‌తో స‌త్క‌రించింది. 2001లో జీవిత సాఫ‌ల్య అవార్డును అందుకున్నారు.13 మంది హీరోయిన్స్‌, 15మందికి పైగా హీరోలు స‌హా ఎంతో మంది కొత్త న‌టీన‌టులను, టెక్నిషియ‌న్స్‌ను సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారు దాస‌రి. తెలుగు క‌ళామ‌త‌ల్లి ముద్దుబిడ్డ‌గా ఎన‌లేని సేవ చేసిన దాస‌రి వంటి ద‌ర్శ‌కుడు మ‌రొక లేడు..రాలేడు

More News

దాసరి గారి మరణం షాక్ కి గురిచేసింది : చిరంజీవి

దర్శకరత్న దాసరిగారి అకాల మరణ వార్తను నేను జీర్ణించుకోలేకపోతున్నాను.ఇటీవలే ఆయన ఆనారోగ్యం కారణంగా అల్లు రామలింగయ్య గారి అవార్డును స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి నా చేతు మీదుగా అందజేశాను.

దాసరి ఆరోగ్యం నిలకడగా ఉంది - కిమ్స్ వైద్యులు

టాలీవుడ్ దర్శక గురువు దర్శకరత్న డా.దాసరినారాయణరావు ఆరోగ్యంపై ఆందోళనకర పరిస్థితి నెలకొంది.

ఈ మధ్య కాలంలో విన్న సబ్జెక్ట్స్ లో ఎగ్జయిట్ మెంట్ తో చేసిన సినిమా 'అంధగాడు' - రాజ్ తరుణ్

ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్లో రాజ్తరుణ్ హీరోగా ఈడోరకం-ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సూపర్హిట్ చిత్రాలు తర్వాత యువ కథానాయకుడు రాజ్తరుణ్ హీరోగారూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధగాడు`.

ఎవరూ క్లాసిక్ మూవీస్ ను ముందుగా ప్లాన్ చేసుకోలేరు - మధుర శ్రీధర్ రెడ్డి

స్నేహగీతం సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన మధుర శ్రీధర్ రెడ్డి , ఇట్స్ మై లవ్స్టోరీ, బ్యాక్బెంచ్ స్టూడెంట్స్ సినిమాలకు దర్శకత్వం వహించిన తర్వాత నిర్మాతగా మారారు.

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ 'జవాన్' చిత్రం టాకీ పార్ట్ పూర్తి

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.