బైజూస్ రవీంద్రన్‌పై ఈడీ లుక్ ఔట్ నోటీసులు.. దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశాలు.
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా కాలంలో ఎన్నో స్టార్టప్ కంపెనీలు లాభపడ్డాయి. లాక్‌డౌన్ సమయాన్ని కొన్ని స్టార్టింగ్ కంపెనీలు సద్వినియోగం చేసుకున్నాయి. తమ ఉత్పత్తులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి. అలా జనాల్లో మంచి పాపులారింటీ సంపాందిచుకుంది బైజూస్(Byjus) సంస్థ. ఎడ్‌టెక్ కంపెనీగా ఈ సంస్థ లాక్‌డౌన్‌లో ప్రజలకు బాగా దగ్గరైంది. దీంతో కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది. అయితే ఆత్యాశ వినాశనానికి చేటు అనే సామెత గుర్తుకు తెచ్చేలా.. కంపెనీ విలువను వాస్తవం కంటే ఎక్కువ చేసి చూపించడంతో బైజూస్ పతనం మొదలైంది.
ఈ సంస్థ చేసిన పొరపాట్లు ఒక్కొక్కటిగా బయటకు పొక్కడంతో నష్టాల బాట పట్టింది. ఇన్వెస్టర్లు దూరంగా కావడం జరిగారు. దీంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఎంతలా అంటే చివరకు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చేసింది. ఇందుకోసం సంస్థకు ఉన్న ఆఫీసులను ఖాళీ చేసే దాకా వచ్చేసింది. ఈ క్రమలోనే పుండు మీద కారం చల్లినట్లు.. అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈ కంపెనీకి ఈడీ భారీ షాక్ ఇచ్చిందతి. బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ దేశం విడిచి వెళ్లకుండా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆయనకు లుకౌట్ నోటీసులు జారీ చేసింది.
గతేడాది బెంగళూరులోని రెండు ఆఫీసులతో పాటు ఆయన నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లుకౌట్ నోటీసులు ఇవ్వడం గమనార్హం. అయితే ఇప్పటికే బైజూస్ రవీంద్రన్‌పై ఆన్ ఇంటిమేషన్ లుకౌట్ సర్క్యూలర్ అమలులో ఉంది. అంటే ఆయన విదేశాలకు వెళ్లినప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈడీకి ముందుగానే సమాచారం అందించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగానే ఇప్పుడు పూర్తి స్థాయి లుకౌట్ సర్క్యూలర్ జారీ చేసింది. దీంతో ఆయన ఈడీ అధికారులు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం కుదరరు. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అధికారులకు కూడా ఈడీ ఆదేశాలు అందిచింది. ఈ నేపథ్యంలో ఇక నుంచి రవీంద్రన్ దేశం విడిచి వెళ్లడానికి కుదరదు.
ఇదిలా ఉంటే రవీంద్రన్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించేందుకు ఇన్వెస్టర్లు అత్యవసర బోర్డు సమావేశానికి పిలుపునిచ్చింది. తక్షణమే కొత్త బోర్డును ఎన్నుకోవాలని నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయంపై కర్ణాటక హైకోర్టును రవీంద్రన్ ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థౄనం బోర్డు సమావేశానికి అనుమతి ఇచ్చింది. కానీ తమ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బోర్డులో తీసుకన్న నిర్ణయాలు అమలు చేయవొద్దని ఆదేశించింది. ఈ సమావేశంలో రవీంద్రన్ కంపెనీ సీఈవోగా తొలగించే అవకాశం ఉంది. మొత్తానికి ఎడ్‌టెక్ కంపెనీగా తక్కువ సమయంలోనే పాపులార్ అయిన బైజూస్ ఇలా పతనం కావడం ఆర్థిక రంగంలో తీవ్ర చర్చనీయాంశమైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout