ఖరీదైన విడాకులు.. భరణంగా రూ.5,555  కోట్లు చెల్లించండి, దుబాయ్ రాజుకు కోర్ట్ ఆదేశం

  • IndiaGlitz, [Wednesday,December 22 2021]

ఏదైనా కారణం చేత భర్త.. భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటే ఆమె జీవితం సాఫీగా సాగేందుకు భరణం కూడా చెల్లించాలి. కాల, మాన పరిస్ధితులతో ఇటీవల విడాకులు తీసుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు విడాకులు తీసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌లు తమ భార్యలకు విడాకులిచ్చారు. ఇందుకు గాను వీరికి వేల కోట్ల రూపాయలు భరణం కింద చెల్లించారు. ఈ సంపదతో వారు ప్రపంచంలోనే మహిళా సంపన్నులుగా నిలిచారు. తాజాగా దుబాయ్ రాజవంశంలో విడాకుల వ్యవహారం వార్తల్లో నిలిచింది.

దుబాయ్ రాజు మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్దూమ్ (72), ఆయన 6వ భార్య హయా బింట్ అల్ హుస్సేన్ (47) విడాకుల సెటిల్ మెంట్ విషయంలో బ్రిటన్ హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. హయాకు భరణం కింద రూ. 5,525 కోట్లను చెల్లించాలని దుబాయ్ రాజును ఆదేశించింది. ఇందులో రూ. 2,521 కోట్లను ఏకమొత్తంలో చెల్లించాలని తీర్పులో పేర్కొంది.

అంతేకాదు రషీద్, హయా సంతానం అల్ జలిలియా (14), జయాద్ (9) లకు చదువు నిమిత్తం రూ. 96 కోట్లు, వారి బాధ్యతల కోసం ప్రతి ఏటా రూ. 112 కోట్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఇతర అవసరాల కోసం రూ. 2,907 కోట్లను బ్యాంకు గ్యారెంటీగా ఇవ్వాలని తెలిపింది. తద్వారా బ్రిటన్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకుల్లో ఇదొకటని మీడియా కథనాలను ప్రచురిస్తోంది. హయా 2019లో దుబాయ్ నుంచి లండన్ వెళ్లిపోయారు. ఆ తర్వాత విడాకుల కోసం అక్కడి హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాదు భర్త నుంచి తన పిల్లలను అప్పగించాలని కోర్టును కోరారు. సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఇప్పుడు సంచలన తీర్పును వెలువరించింది.

More News

బిగ్‌బాస్ 5 విజేత సన్నీకి కరెంట్ షాక్.. ప్రె‌స్‌మీట్‌లో వుండగానే ఘటన, వీడియో వైరల్

హోరాహోరీగా జరిగిన బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్‌ విజేతగా వీజే సన్నీ గెలుపొందిన సంగతి తెలిసిందే.

వి.వి వినాయక్ చేతుల మీదుగా విడుదలైన  వెంప కాశీ 'పంచనామ' ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్

వెంప కాశీ గారు పుట్టినరోజు సందర్భంగా హార్దిక్ క్రియేషన్ చిత్ర యూనిట్ మాస్ డైరెక్టర్  వి.వి వినాయక్ గారు

వీకెండ్ బాక్సాఫీస్ రిపోర్ట్ : ఫుల్ స్వింగ్‌లో పుష్ప.. తెలంగాణలో సరికొత్త రికార్డ్

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా అంచనాలను మించి అదరగొడుతోంది.

ఇట్స్ అఫిషీయల్ : ఫిబ్రవరిలో ‘‘గాడ్‌ఫాదర్‌’’ షూటింగ్‌లో పాల్గొననున్న సల్మాన్ ఖాన్

బాలీవుడ్ స్టార్స్ అంతా ఇప్పుడు టాలీవుడ్ వైపు చూస్తున్నారు. వరుసపెట్టి పాన్ ఇండియా స్థాయి సినిమాలతో ఇప్పుడు తెలుగు పరిశ్రమ జాతీయ స్థాయిని ఆకర్షిస్తోంది.

పవన్ ఫ్యాన్స్‌కు నిరాశ .. భీమ్లా నాయక్ విడుదల వాయిదా, మళ్లీ రిలీజ్ ఎప్పుడంటే..?

అనుకున్నదే నిజం అయ్యింది. భీమ్లా నాయక్ రిలీజ్ వాయిదా పడుతుందంటూ జరుగున్న ప్రచారం ఊహాగానాలు కాదు...