London Babulu Review
జయాపజయాలను పక్కన పెడితే తమిళం సహా ఇతర భాషల నుండి తెలుగులోకి సినిమాలు రీమేక్ అవుతుండం మనం చూస్తున్నాం. ఇప్పుడు అలాగే తమిళం నుండి తెలుగులోకి రీమేక్ అయిన చిత్రం `లండన్‌బాబులు`. ఈ సినిమాను ప్రముఖ దర్శక నిర్మాత మారుతి తన నిర్మాణ సంస్థపై రూపొందించడంతో పాటు తమిళంలో విలక్షణమైన పాత్రలు చేసే హీరో విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ మణికంఠన్ ఈ సినిమాను రూపొందించారు. ఇక తెలుగు విషయానికి వస్తే, ఓ సక్సెస్ కూడా లేని దర్శకుడు చిన్ని కృష్ణ ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. మరి ఈ లండన్‌బాబు ఏం చెప్పారో తెలుసుకోవాలంటే సినిమా కథలోకి ఓ లుక్కేద్దాం.
కథ:
ఊరి నిండా అప్పులున్న గాంధీ(రక్షిత్) విదేశాలకు వెళ్లి డబ్బులు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో లండన్‌లో స్థిరపడ్డ తన ఊరి వ్యక్తి ఇచ్చిన సలహాతో...తన చిన్ననాటి స్నేహితుడు పాండు(సత్య)తో కలిసి సిటీ చేరుకుంటాడు. అక్కడ ట్రావెల్ ఏజెంట్ కుమార్(జీవా) గాంధీ, పాండులను లండన్ పంపడానికి ఏర్పాటు చేస్తానని మాట ఇస్తాడు. అందులో భాగంగా ముందు పాస్‌పోర్ట్ అప్లై చేసే సమయంలో తన భార్య పేరు సూర్య కాంతం అని ఓ డూప్లికేట్ నేమ్‌ను అప్లికేషన్ గాంధీ రాస్తాడు. అయితే వీసా మాత్రం రిజెక్ట్ అయిపోతుంది. దాంతో మరో ఆరు నెలలు గడువు పెరుగుతుంది. ఈలోపు గాంధీ సురభి నాటక కంపెనీలో అకౌటెంట్‌గా జాయిన్ అవుతాడు. ఆ నాటకాల కంపెనీ నిర్వాహకుడు మురళీశర్మ చాలా నిజాయితీ పరుడు. ఆయన నిజాయితీ చూసిన గాంధీ, తన పాస్‌బుక్‌లో భార్య పేరుతో అబద్ధపు పేరును తొలగించాలనుకుని పాస్‌పోర్ట్ ఆఫీస్ వెళతాడు. అక్కడ నుండి అసలు కష్టాలు మొదలవుతాయి. వీరికి మధ్యలో టీవీ రిపోర్టర్ సూర్య కాంతం సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తుంది. తర్వాత పరిస్థితులెలా మారుతాయి. అసలు గాంధీ లండన్ వెళ్లాడా? లేదా అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
ఇందులో ముందుగా సాంతికేతిక నిపుణుల విషయానికి వస్తే..దర్శకుడు చిన్నికృష్ణ..రీమేక్‌ను తెలుగు నెటివిటీకి మార్చి తెరకెక్కించిన విధానం చాలా బావుంది. కథను వివిధ లేయర్స్‌తో నెటివిటీ సమస్య లేకుండా చక్కగా తీశాడు. హీరో, హీరోయిన్ మధ్య సీన్స్‌ను చాలా చక్కగా ప్రెజెంట్ చేశాడు. సీన్స్‌లో ఎక్కడా మనకు ఓవర్ డోస్‌లో నటించనట్లు అనిపించదు. సినిమా సింపుల్ పాయింట్‌తో తెరకెక్కినప్పటికీ అందులోని లేయర్స్‌ను చక్కగా డిజైన్ చేసుకోవడంతో సినిమా కూల్‌గా సాగిపోతున్నట్లు అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్‌లోనే రెండు పాటలు కూడా సాగిపోతాయి. ట్యూన్స్ ఆకట్టుకునేలా ఉండవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. శ్యామ్ కె.నాయుడి సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. అలాగే ఇక నటీనటుల విషయానికి వస్తే..హీరో రక్షిత్ తొలి సినిమా అయినప్పటికీ చక్కగా నటించాడు. తమిళంలో విజయ్ సేతుపతి వంటి సీనియర్ నటుడు చేసిన రోల్‌ను రక్షిత్ క్యారీ చేసిన తీరు చాలా బావుంది. అక్కడక్కడా మినహా రక్షిత్ ఓ సెటిల్డ్ పెర్ఫామెన్స్ చేశాడు. ఇక హీరోయిన్ స్వాతి గురించి చెప్పాల్సిన పనిలేదు. తను సూర్య కాంతం అనే పాత్రలో ఒదిగిపోయింది. హీరోకి, అతని స్నేహితుడికి సహాయం చేసే పాత్రలో నటించిన ధనరాజ్ ..ఎమోషనల్ సీన్స్‌లో చక్కగా చేశాడు. అలాగే హీరో స్నేహితుడి పాత్రలో కనిపించిన సత్య, సాయిలతో తమ తమ పాత్రలకు తగ్గట్లు నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక సెకండాఫ్‌లో వచ్చే అలీ, సత్యకృష్ణ కామెడీ ట్రాక్ ఆడియెన్స్‌ను నవ్విస్తుంది. చాలా రోజుల తర్వాత సత్యకృష్ణ ఓ మంచి పాత్రలో కనిపించింది. ..మురళీశర్మ, అజయ్ ఘోష్‌లు వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు.
బోటమ్ లైన్: వీసా కోసం 'లండన్ బాబులు' తిప్పలు
London Babulu Movie Review in English
- Read in English