'లండన్ బాబులు' షూటింగ్ పూర్తి

  • IndiaGlitz, [Friday,November 10 2017]

ఎప్పటిక‌ప్పుడు మంచి కాన్సెప్ట్ ల‌తో లిమిటెడ్ బ‌డ్జెట్ లో క్వాలిటిగా చిత్రాల‌ను నిర్మిస్తున్న మారుతి టాకీస్ బ్యాన‌ర్ పై నిర్మించిన చిత్రం లండ‌న్ బాబులు. ఎవిఎస్ స్టూడియోస్‌ సమర్పణలో ప్రముఖ దర్శక‌, నిర్మాత‌ మారుతి నిర్మాతగా, చిన్ని కృష్ణ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 17న గ్రాండ్ గా విడ‌దల కానుంది.

త‌మిళం లో విజ‌య్‌ సేతుప‌తి, రితికా సింగ్ క‌ల‌సి నటించిన "ఆండ‌వ‌న్ క‌ట్టాలై" చిత్రాన్ని తెలుగు లో రీమేక్ చేశారు. నేటి యువత ప్రేమకి, పెళ్లికి ఎంత తొందర పడుతున్నారో అంతే తొందర విడాకులు తీసుకోవడంలో కూడా ముందున్నారు. అలాంటి ఓ జంట లండన్ ప్రయాణంలో జరిగిన పరిస్థితులను దర్శకుడు వినోదాత్మకంగా ఎమోషనల్ గా తెరకెక్కించారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత మారుతి మాట్లాడుతూ.. త‌మిళం లో విజ‌య్‌సేతుప‌తి, రితిక న‌టించిన "ఆండ‌వ‌న్ క‌ట్టాలై" చిత్రానికి రీమేక్ గా మా బ్యాన‌ర్ మారుతి టాకీస్ లో నిర్మించిన‌ చిత్రం లండ‌న్ బాబులు. ఈచిత్రం త‌మిళంలో చాలా పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఈ కాన్సెప్ట్ న‌చ్చి ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశాము. అద్యుత‌మైన కామెడి టైమింగ్ తో న‌టుడుగా కొత్త‌బంగారు లోకం చిత్రంలో ఇంగ్లీష్ మాట్లాడుతూ న‌వ్వించిన చిన్నికృష్ణ‌ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. నేటి యువత ప్రేమకి, పెళ్లికి ఎంత తొందర పడుతున్నారో అంతే తొందర విడాకులు తీసుకోవడంలో కూడా ముందున్నారు. అలాంటి ఓ జంట లండన్ ప్రయాణంలో జరిగిన పరిస్థితులను దర్శకుడు వినోదాత్మకంగా ఎమోషనల్ గా తెరకెక్కించారు.

చిన్నికృష్ణ కామెడి టైమింగ్ కూడా ఈ చిత్రానికి చాలా హెల్ప్ అయ్యింది. అలాగే స్వాతి హీరోయిన్ గా నటించింది. స్వాతి మీడియాలో యాంక‌ర్ గా సోసైటి ప‌ట్ల భాద్య‌త క‌లిగిన పాత్ర‌లో చాలా బాగా చేసింది. ర‌క్షిత్ హీరోగా ప‌రిచ‌యమ‌వుతున్నాడు. కొత్త వాడిలా కాకుండా సీనియ‌ర్ న‌టుడిగా పాత్ర‌లో ఒదిగిపోయాడు.

సీనియ‌ర్ న‌టులు ఆలీ, ముర‌ళి శ‌ర్మ‌, జీవా , అజ‌య్ ఘొష్‌, రాజార‌వింద్ర ముఖ్య‌మైన పాత్ర‌ల్లో నటించారు. ఒక్కోక్క‌రి పాత్ర చిత్ర క‌థ‌ని మ‌లుపులు తిప్పుతూ చివ‌ర‌కి హీరో లండ‌న్ ఎలా వెళ్ళాడ‌నేది ముఖ్య‌ క‌థాంశం. ప్ర‌తిపాత్ర‌కు ఇంపార్టెన్స్ ఇస్తూ ద‌ర్శ‌కుడు చాలా కొత్త‌గా చిత్రాన్ని తెర‌కెక్కించాడు. క‌మెడియ‌న్స్ ధ‌న‌రాజ్‌, స‌త్య‌, ఈరోజుల్లో సాయి కామెడితో న‌వ్వించారు.

ఈ చిత్రానికి శ్యామ్‌.కె.నాయిడు కెమెరా, ఉద్ద‌వ్ ఎడిటింగ్ మ‌రో ఎసెట్ గా నిలుస్తాయి. ప్ర‌తి పాత్ర‌కి ఇంపార్టెన్స్ వుండేలా ద‌ర్వ‌కుడు రాసుకున్నాడు. ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాం. అని అన్నారు.

More News

'జవాన్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వివరాలు

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా , బివిఎస్ రవి దర్శకత్వం చేసిన చిత్రం జవాన్. ఈ చిత్రం ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

పెళ్లి పీట‌లెక్క‌నున్నన‌మిత‌..

బొద్దుగుమ్మ న‌మిత త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనుంది. త‌మిళ న‌టుడు వీర అలియాస్ వీర బాహుని ఈ న‌వంబ‌ర్ 24న తిరుప‌తిలో ఈ అమ్మ‌డు పెళ్లి చేసుకోనుంది.

విష్ణు మంచు 'ఆచారి అమెరికా యాత్ర' చిత్ర ఫస్ట్ లుక్

విష్ణు జన్మదినం సందర్భంగా నవంబర్ 23 న విడుదల కానుంది. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రాన్ని చాలా వరకు అమెరికా, మలేషియా మరియు హైదరాబాద్ లలో చిత్రీకరించారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతుంది. 

'అజ్ఞాత‌వాసి' పాట‌లు అప్పుడేనా?

'అజ్ఞాత‌వాసి' పాట‌లు గురించి ఈ మ‌ధ్య చ‌ర్చ ఎక్కువ‌గా సాగుతోంది. బైట‌కొచ్చి చూస్తే అనే సింగిల్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి 'అజ్ఞాత‌వాసి' పాట‌ల మీద ఆసక్తి ఎక్కువైంది.

రామ‌య్య స‌న్నిధిలో తార‌క్‌

భ‌ద్రాద్రి రాముల‌వారి స‌న్నిధిలో ఎన్టీఆర్ శుక్ర‌వారం గ‌డిపారు. భ‌ద్రాద్రి రామాల‌యానికి ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి వెళ్లారు. చిన్న‌త‌నంలో ఆయ‌న రాముడిగా న‌టించిన విష‌యం తెలిసిందే.