'లాల్ సలామ్' ట్రైలర్: మా ఫ్రెండ్ ల్యాండ్ మైన్ తొక్కాడు.. ఏం చేయాలి..
Send us your feedback to audioarticles@vaarta.com
కోవిడ్ ఎఫెక్ట్ తో థియేటర్లు మూతపడ్డాయి. దీనితో ఎంటర్టైన్మెంట్ ప్రియులకు ఓటీటీలే ఆధారంగా మారాయి. వినోదాన్ని కోరుకునే ప్రేక్షకులని దృష్టిలోపెట్టుకుని ఓటిటి సంస్థలు బోలెడన్ని చిన్నబడ్జెట్ చిత్రాలు, వెబ్ సిరీస్ లని తీసుకువస్తున్నాయి.
ఇదీ చదవండి: 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' ట్రైలర్ : కోరికని రెచ్చగోట్టెది సైతాన్.. ప్రాణం తీసేది దేవుడు
లాక్ డౌన్ లో వెబ్ సిరీస్ లకు ఆదరణ విశేషంగా పెరిగింది. ఈ నేపథ్యంలో వివిధ జోనర్స్ లో వెబ్ సిరీస్ లు రూపొందిస్తున్నారు. నాని అనే దర్శకుడు తెరకెక్కించిన ఫన్ రైడ్ వెబ్ సిరీస్ 'లాల్ సలామ్'. హాస్యం, వినోదం ప్రధానంగా ఈ వెబ్ సిరీస్ రూపొందింది.
నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియాలో లాల్ సలామ్ ట్రైలర్ విడుదల చేశారు. ఆరుగురు స్నేహితులు టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి ఎక్కడికైన దూరంగా టూర్ వెళ్లాలనుకుంటారు. ఆ ఆరుగురు స్నేహితుల కథే ఈ లాల్ సలామ్ వెబ్ సిరీస్. అనుకోని పరిస్థితుల వల్ల వారంతా ఫారెస్ట్ లో చిక్కుకుంటారు.
అక్కడ వారు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేది ట్రైలర్ లో ఫన్నీగా చూపించారు. ఆరుగురు స్నేహితులుగా భరద్వాజ్, శ్రీనివాస్ రెడ్డి, దరహాస్ మధుర్, పవన్ కుమార్, రోహిత్ కృష్ణ నటించారు. నటుడు హర్ష వర్ధన్ మరో కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
ఆరుగురు స్నేహితుల్లో ఒకడు అడవిలో అనుకోకుండా ల్యాండ్ మైన్ పై కాలువేస్తాడు. దీని చుట్టూ అల్లిన కామెడీ పంచ్ లో ట్రైలర్ లో బాగా పేలాయి. 'తాత అడవిలో మా ఫ్రెండ్ ల్యాండ్ మైన్ తొక్కాడు..ఏం చేయాలి' అని అడగగా 'వెళ్లి కాళ్ళు కడుక్కోమను .. ఏం నీళ్లు లేవా' అని ఓ తాత ఇచ్చే సమాధానం చాలా ఫన్నీగా ఉంది. జూన్ 25న ఈ వెబ్ సిరీస్ ని జీ5 ఓటిటిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com