భారత్లో మే-03 తర్వాత లాక్డౌన్ టెన్షన్.. టెన్షన్!
- IndiaGlitz, [Monday,April 27 2020]
ప్రపంచమంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతోంది. ఒక్కటే టెన్షన్ టెన్షన్.. మాయదారి కరోనా వైరస్ వల్ల ప్రపంచం మొత్తం వణికిపోతోంది. కరోనా వల్ల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఇదిలా ఉంటే మన భారతదేశం పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఈ మాయదారి కరోనా మహ్మామారి భారతదేశాన్ని కూడా చుట్టూ ముట్టి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. అంతేకాదు దేశ ఆర్థిక వ్యవస్థను సైతం కుప్పకూల్చింది. ఇప్పుడు దేశంలో అంతా లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా వల్ల భారత దేశంలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ముంబైలో మాత్రం కరోనా మాములుగా లేదు.
వాట్ నెక్స్ట్..!
ఇండియాలో కట్టుదిట్టమైన లాక్ డౌన్ తో ఇప్పటివరకు కరోనాను భారత్ కట్టడి చేసింది. అయితే..ఇప్పుడు ఇండియాలో లాక్ డౌన్ ఎత్తివేస్తే పరిస్థితి ఏంటి అని..ప్రశ్నార్థకంగా మారింది. భారత్ దేశంలో లాక్ డౌన్ గత నెల మార్చి 21 నుంచి ఏప్రిల్ 14 వరకు అని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే..దేశంలో కరోనా పరిస్థితి మరింత తీవ్రం కావడంతో కేంద్రం.. అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్పరేన్స్ నిర్వహించి అందరి నిర్ణయాలను తీసుకుని ఈ కాస్త లాక్ డౌన్ ను వచ్చే నెల మే 3వరకు పొడిగించింది కేంద్రం. దేశ ప్రజల దష్ట్యా..కరోనాను అంతమొందించడానికి మరో మందు లేదంటూ పొడిగిస్తున్నామని దేశ నరేంద్ర మోదీ తెలిపారు.
మే 3న లాక్ తీస్తారా..పొడిగిస్తారా..?!
ఇండియాలో ఇప్పటి వరకు లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలౌవుతుంది. ఈ లాక్ డౌన్ వల్ల సామాన్య ప్రజలను బిజినెస్ మ్యాన్ల వరకు లాక్ డౌన్ ఎప్పుడు సడలిస్తారా అనే విషయం మీదనే ఆలోచిస్తున్నారు. అయితే.. దీనిపై స్పష్టత రావాలంటే మే 27వ తేదీన ప్రధాని మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ ప్రసంగంలో మోదీ ఏ విషయం చెబుతారో అని భారత ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే భారతదేశంలో మొత్తం సర్వీసులు నిలిచిపోయాయి. అయితే ప్రజలకు తిండికి తిప్పలు కాకూడదని నిత్యావసరాల సరకుల రవాణాకు ఇబ్బంది లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంది. ఇలాగే లాక్ డౌన్ కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు అయ్యే ఛాన్స్ బాగా కనిపిస్తున్నాయి. అయితే లాక్ డౌన్ పొడిగిస్తారా..? లేదా..? అనే దానిపై స్పష్టత రావాలంటే దేశ ప్రధాని నుంచి మరోసారి ప్రసంగం కోసం వేచిచూడాల్సిందే. ఒక వేళ కరోనా వైరస్ దేశంలో తగ్గుముఖం పడితే లాక్ డౌన్ ను కొన్ని ఆంక్షలతో సడలించే అవకాశం ఉంది. ఒక్కసారిగా లాక్ డౌన్ ఎత్తివేస్తే మరింత తీవ్రం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. 80 శాతం వరకు లాక్ డౌన్ జూన్ వరకు పొడిగించే అవకాశాలు మాత్ర బాగానే కనిపిస్తున్నాయి. మొత్తానికి కరోనా అంతం చేయడానికి భారతదేశం చేస్తున్న లాక్ డౌన్ పై ప్రపంచ దేశాలు గర్విస్తున్నాయి.