ఏప్రిల్-20 తర్వాత సడలింపులు.. ఒక్క కేసు పెరిగినా..: మోదీ
Send us your feedback to audioarticles@vaarta.com
ఏప్రిల్- 20వరకూ కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తామని.. ఆ తర్వాత కరోనా హాట్ స్పాట్‌లు లేని ప్రాంతాల్లో సడలింపులు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇందుకు సంబంధించి రేపు అనగా బుధవారం నాడు గైడ్ లైన్స్ విడుదల చేస్తామన్నారు.
ఏప్రిల్-20 తర్వాత..!
‘ఇప్పటి వరకు సాధించిన విజయం ప్రజా విజయం. ఒక్కరూ కరోనా భారీన పడకూడదనే లక్ష్యంతో అందరూ ఇదే విధంగా కలిసి పని చేస్తాం. ఏప్రిల్ 20 వరకు మరింత కఠినంగా నిబంధనలు ఉంటాయి. కరోనా వ్యాప్తి నియంత్రణపై ప్రతి జిల్లా, గ్రామ స్థాయి వరకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్న చర్యలపై పూర్తిస్థాయి నిఘా ఉంటుంది. ఏప్రిల్ 20 తరువాత లాక్ డౌన్‌లో కొన్ని అత్యవసర అంశాలకు నిబంధనలతో కూడిన సడలింపు ఉంటుంది. దాన్ని కూడా ఎప్పుడైనా వెనక్కు తీసుకునేలాగా ఆ సడలింపు కూడా ఉంటుంది. రోజు వారి కూలీలకోసం ప్రధాని గరీబ్ కల్యాణ్ యోజనతో వారికి ప్రయోజనం కల్పిస్తున్నాము. మందులు, రేషన్ అన్నీ మన వద్ద కావాల్సినంత ఉంది. కరోనా నియంత్రణలో భాగంగా లక్ష బెడ్లు సిద్ధంగా ఉన్నాయి. ఆరు వేల కోవిడ్ ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయి. యువ శాస్త్ర వేత్తలు కరోనా వ్యాక్తిన్ తీసుకువచ్చేందుకు ముందు రావాలి’ అని మోదీ పిలుపునిచ్చారు.
అన్నీ ఆలోచించాకే...
‘ప్రపంచంతో పోలిస్తే ఇండియా అన్ని విధాల తినడానికి, ప్రయాణాలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ భారత దేశ ప్రజలు దీన్ని ఎంతో సహనంతో పాటిస్తున్నారు. భారతదేశంలో 10 వేల కరోనా కేసులు నమోదయ్యాయి, 300 మంది చనిపోయారు. ఎకనామి కంటే జీవితం గొప్పది. ఎయిర్ పోర్టు స్క్రీనింగ్ పూర్తయ్యాక ఒక్క కేసు కూడా నమోదు లేదు. భౌతిక దూరం దేశానికి చాలా ఉపయోగపడింది. కరోనాపై భారత్ యుద్ధం కొనసాగుతోంది. ఇదే ఐక్యమత్యం స్ఫూర్తి ఇంకా 19 కొనసాగాలి. ఇదే ఐక్యమత్యం స్ఫూర్తి ఇంకా 19 కొనసాగాలి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ పొడగించాయి. హాట్‌స్పాట్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలి. అన్ని ఆలోచించాక మే 3 వరకు పొడిగించాలని నిర్ణయించాం. లాక్‌డౌన్ పొడిగించాలని రాష్ట్రాలు కోరాయి. మే-03 వరకు ప్రతి పౌరుడు సహకరించాలి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ పొడగించాయి. హాట్ స్పాట్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఎలాంటి నిర్లక్ష్యాన్ని కూడా సహించేది లేదు. వచ్చే మూడు, నాలుగు వారాలు చాలా కీలకమైనవి’ అని మోదీ స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com