ఇకపై 10 గంటలు దాటితే రోడ్లపైకి వచ్చారో..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా విస్తృతిని దృష్టిలో పెట్టుకుని.. కేసులను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఫస్ట్ వేవ్ సమయంలో ఉన్నంత స్ట్రిక్ట్‌గా.. ఇప్పుడు పోలీసులు లేరన్న టాక్ రావడంతో వాహనదారులు చెలరేగిపోతున్నారు. విచ్చలవిడిగా బయటకు వచ్చి తిరిగేస్తున్నారు. రిలాక్సేషన్ తరువాత కూడా అనుమతి లేకుండా వాహనాలతో బయటకు వచ్చి రోడ్లపై చెక్కర్లు కొడుతున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు ఏకంగా డీజీపీ మహేందర్‌రెడ్డి రంగంలోకి దిగారు. కీలక ఆదేశాలు జారీ చేశారు.
పోలీస్ అధికారులతో నేడు డీజీపీ మహేందర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రిలాక్సేషన్ తరువాత అంటే ఉదయం 10 గంటల తర్వాత ఇకపై ఎవరైనా అనవసరంగా రోడ్లపైకి వస్తే వారి వాహనాల్ని సీజ్ చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేసేందుకు కాలనీలు, అంతర్గత రహదారుల్లో పోలీసు నిఘాను మరింత పటిష్టం చేయాలని సూచించారు. ఉదయం 10 గంటలు అవగానే గస్తీ వాహనాలన్నీ సైరన్ మోగించాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
అలాగే రిలాక్సేషన్ సమయంలో కూడా ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తున్నారు. ఎక్కడా సోషల్ డిస్టెన్స్ అనేదే కనిపించడం లేదు. దీనిపై కూడా డీజీపీ దృష్టి సారించారు. ఉదయం 6 గంటల నుంచే బయటకు వచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేసేలా చైతన్యపరిచే అంశంపై దృష్టి సారించాలని డీజీపీ సూచించారు. కరోనా వ్యాప్తికి అవకాశమున్న చేపలు, కూరగాయల మార్కెట్లలో రద్దీని తగ్గించేందుకు తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు డీజీపీ జితేందర్, నిఘా విభాగం ఐజీ ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments