కరోనా కట్టడికి ఈ ఏడు సూత్రాలు పాటించండి: మోదీ
- IndiaGlitz, [Tuesday,April 14 2020]
కరోనాపై ‘సప్తపది’తో విజయం సాధించవచ్చునని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసగించిన మోదీ.. దేశ వ్యాప్తంగా మే-03 వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుందని కీలక ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని సప్తపది సూత్రాలు చెప్పారు.
సప్తపదితో కరోనాపై విజయం..
01. మీ ఇంట్లో వ్యాధి గ్రస్తులు, పెద్దలు ఉంటే వారికి కరోనా సోకకుండా అత్యంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని వారిని కాపాడుకుందాం.
02. భౌతిక దూరాన్ని తప్పకుండా పాటించండి. మాస్కు ధరించండి
03. వ్యాధి నిరోద శక్తి పెంచటానికి ఆయుష్ సూచనలు పాటించండి. ఆయుష్ సూచించేలా వేడి నీళ్లు తాగటం వంటివి పాటించండి
04. ఆరోగ్యసేత మొబైల్ యాప్‌ను తప్పని సరిగా డౌన్ లోడ్ చేసుకోండి. ఇతరులను డౌన్ లోడ్ చేసుకునేలా చేయండి.
05. మీ చుట్టు పక్కల పేదలకు భోజనం కల్పించండి.
06. మీ పొలాల్లో గానీ, ఇతర ఉపాధి రంగాల్లోగానీ పొందుతున్న వారికి ఉపాధిని దూరం చేయవద్దు.
07. నర్సులు, వైద్యులు, పోలీసులు, పారిశుద్య కార్మికులను గౌరవించాలి.. వారి సేవలను గుర్తించండి అని మోదీ ప్రకటించారు.