లాక్ డౌన్ 3.0 : మే-17 వరకూ పొడిగింపు
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు లాక్డౌన్ పొడిగించిన కేంద్రం తాజాగా మరోసారి పొడిగించింది. ఈ 3.0 లాక్డౌన్ రెండు వారాల పాటు అనగా మే-17 వరకు కొనసాగనుంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కేంద్ర హోం శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
గ్రీన్, ఆరెంజ్ జోన్లలో లాక్డౌన్ నుంచి కొన్ని మినహాయింపులు ఉంటాయని స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లలో పూర్తిగా ఆంక్షలు అమలు కానున్నాయి. ఇదిలా ఉంటే.. ఇదివరకటి లాగే రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు, విమానాలపై నిషేధం కొనసాగనుంది. రాష్ట్రాల మధ్య రాకపోకలు కూడా పూర్తిగా నిషేధిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ తేల్చిచెప్పింది. కాగా.. రేపు ఉదయం 10గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
వీటిపై కూడా..
వీటితో పాటు.. సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు, టాక్సీలు, క్యాబ్‌లు తిరగవు. బార్బర్ దుకాణాలు, స్పా, సెలూన్లు తెరవరాదని హోం శాఖ స్పష్టంచేసింది. దేశ వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, మాల్స్, జిమ్స్, స్పోర్ట్ కాంప్లక్సులపై కూడా నిషేధం కొనసాగనుంది. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, జనాలు గుమికూడటంపై ఆంక్షలు కొనసాగనున్నాయి. మతపరమైన కార్యక్రమాలకు జనాలు గుమికూడటంపై కూడా నిషేధం కొనసాగనుందని కేంద్రం ప్రకటనలో నిశితంగా వివరించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout