జూన్-30 వరకు 5.0 లాక్ డౌన్

  • IndiaGlitz, [Sunday,May 31 2020]

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరోసారి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను పొడిగించింది. ఎల్లుండితో 4.0 పూర్తి కానుండటంతో దాన్ని పొడిగిస్తూ జూన్-30 వరకు 5.0 అమల్లోకి రానుంది. ఈ మేరకు

కొత్త మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది.

ఇవి మాత్రమే తెరుచుకుంటాయ్..

జూన్‌ 8 నుంచి ప్రార్థనా స్థలాలకు అనుమతి

మందిరాలు, హోటళ్లు, మాల్స్‌ ప్రారంభం

జులైలో స్కూళ్లు, కాలేజీలకు అనుమతి ఇచ్చే అవకాశం

కట్టడి ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ మరింత కఠినతరం

ఇకపై రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ

అంతర్జాతీయ ప్రయాణాలు, మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌పై ఫేజ్‌-3లో నిర్ణయం

కట్టడి ప్రాంతాల్లో అత్యవసర సేవలకే అనుమతి

పార్కులు, బార్లు, ఆడిటోరియంలు, పబ్బులకు అనుమతి లేదు

రాష్ట్రాల మధ్య ప్రజలు, సరకుల రాకపోకలకు అనుమతులు అవసరం లేదు

జూన్8 నుంచి సడలింపులు ఉంటాయని కేంద్రం నిబంధనల్లో ప్రకటించింది.