లాక్ డౌన్ ఎఫెక్ట్ : యువ నటి ఆత్మహత్య

  • IndiaGlitz, [Wednesday,May 27 2020]

కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్‌తో సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ ఎలాంటి అవస్థలు పడుతున్నారో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా వలస కార్మికులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు.. ఒక్కసారి అటు హైవే వైపు చూస్తే కన్నీళ్లు ఆగవు. ఇంకోవైపు.. కాలినడకనే కొందరు కన్నుమూస్తుండగా.. మరి కొందరు తినడానికి తిండి, నీళ్లు ఆకలితో అలమటిస్తూ తుది శ్వాస విడిచేస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌కు చెందిన ప్రేక్ష మెహతా (25) ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు కారణం లాక్ డౌన్ అని తెలుస్తోంది.

ఇంతకీ ఎవరీమె..!?
సోమవారం రాత్రి మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని తన నివాసంలో ప్రేక్ష ఆత్మహత్య చేసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమవారం రాత్రి సీలింగ్ ఫ్యాన్‌‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం మంగళవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నుంచి ఎంతకీ ప్రేక్ష బయటికి రాకపోవడంతో అసలేం జరిగిందని తలుపులు పగులకొట్టి చూడగా విగత జీవిగా పడి ఉన్న అమ్మాయిని చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు. నటి మృతిపట్లు పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదిగా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

కారణమేంటి..!?
కాగా.. లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధిని కోల్పోవడంతో డిప్రెషన్‌కు లోనైన ప్రేక్ష ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియవచ్చింది. ఇదిలా ఉంటే.. చనిపోవడానికి ముందు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో.. ‘కన్న కలలు చనిపోయినప్పుడు... జీవితం చెత్తగా ఉంటుంది’ అని పోస్ట్ చేసింది. ఈ సందేశం పెట్టిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఫోన్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేశారు.

ప్రేక్ష నటించిన షోలు ఇవే..
‘క్రైమ్ పెట్రోల్’, ‘లాల్ ఇష్క్’, ‘మేరీ దుర్గ’ టీవీ షోల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్రేక్ష అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో స్టార్ హీరోల సినిమాల్లో కూడా అవకాశాలొచ్చాయ్. స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘ప్యాడ్ మేన్’ చిత్రంలో ప్రేక్ష నటించి మెప్పించింది. ఇలా నటనపై ఎంతో మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. ఇలా చనిపోవడం పట్ల తోటి నటీనటులు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.

More News

థ్యాంక్యూ సీఎం జగన్ గారూ.. : నాగబాబు

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరర్థక ఆస్తుల అమ్మకాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

హైకోర్టు షాక్ : వైసీపీ ఎంపీ, ఆమంచి సహా 49 నోటీసులు

న్యాయస్థానాలు, న్యాయవాదులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అలాంటిది అన్నీ తెలిసిన అది కూడా ప్రజా ప్రతినిధులు వివాదాస్పద వ్యాఖ్యలు

ఐటెమ్ సాంగ్సే బెట‌రంటున్న ముద్దుగుమ్మ‌

సినీ ఇండ‌స్ట్రీలో ముఖ్యంగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టేవారంద‌రూ హీరోనో, హీరోయినో కావాల‌నే అడుగు పెడుతుంటారు. అదే కోరితో ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మల్లో హంసానందిని ఒక‌రు.

‘అల వైకుంఠ‌పురములో..’ గ్లోబెల్ రికార్డ్‌

ఈ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లోని పాట‌ల్లో అల వైకుంఠ పుర‌ములో సాంగ్స్‌కు వ‌చ్చినంత రెస్పాన్స్ మ‌రే సినిమాకు రాలేదు. అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో

మ‌రో పాన్ ఇండియా క‌థ‌లో విజ‌యేంద్ర ప్ర‌సాద్‌

బాహుబ‌లి, భ‌జ‌రంగీ భాయ్‌జాన్, మ‌ణిక‌ర్ణిక వంటి భారీ పాన్ ఇండియా చిత్రాల‌కు క‌థ‌ల‌ను అందించిన సీనియ‌ర్ స్టోరీ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్.