లాక్‌డౌన్ మహత్స్యం.. హైదరాబాద్‌లో తగ్గిన కాలుష్యం..
Send us your feedback to audioarticles@vaarta.com
లాక్‌డౌన్ పుణ్యమాని 2019తో పోలిస్తే హైదరాబాద్‌లో కాలుష్యం చాలా వరకూ తగ్గంది. ఒక ప్రాంతం అని లేకుండా హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లోనూ ధూళి కణాల(పీఎం 10) తీవ్రత బాగా తగ్గింది. అయితే కేంద్ర కాలుష్య మండలి నిర్దేశిత పరిమితులకు మాత్రం మించి నమోదవడం గమనార్హం. లాక్‌డౌన్ కారణంగా కొన్ని నెలల పాటు వాహనాలేవీ రోడ్డెక్కలేదు. బస్సులైతే రెండు నెలల క్రితం వరకూ డిపోలకే పరిమితమయ్యాయి. పిల్లలకు స్కూళ్లు నేటికీ తెరవలేదు. దీంతో పిల్లలకు సంబంధించిన బస్సులు, ఆటోలు, బండ్లు ఏవీ రోడ్డెక్కలేదు. ఉద్యోగులు సైతం వర్క్ ఫ్రం హోం చేయడంతో వారికి సంబంధించిన వాహనాలు సైతం రోడ్డెక్కలేదు. దీంతో కాలుష్యం చాలా వరకూ తగ్గిపోయింది.
నిత్యం గాలిలోకి 40 రకాల కాలుష్య ఉద్గారాలు విడుదలవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ను ఇబ్బంది పెడుతున్నది.. అత్యంత ప్రమాదకరమైనది పీఎం 10. దీని సైజు తల వెంట్రుక కంటే ఐదు రెట్లు తక్కువగా ఉంటుంది. ఇంత చిన్న సైజు ఉన్న పీఎం 10 నగర ప్రజానీకం అనారోగ్యానికి కారణమవుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరిమితుల ప్రకారం ఘనపు మీటరు గాలిలో వార్షిక సగటు 60 ఎంజీలు దాటకూడదు. అది దాటితే డేంజర్ జోన్‌లో ఉన్నట్టే. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పీసీబీ క్రమం తప్పకుండా పీఎం 10 తీవ్రతను లెక్కిస్తోంది. దీని ప్రకారమే గతేడాది పరిస్థితిని అంచనా వేశారు.
ఏటికేడు పెరుగుతున్న పీఎం 10 తీవ్రత.. గత ఏడాది మాత్రం తగ్గింది. గాలిలో కలుస్తున్న దుమ్ము ధూళి కణాల్లో 51 శాతం వాహనాల నుంచే వెలువడుతున్నట్టు అధ్యయనంలో తేలింది. లాక్‌డౌన్ కారణంగా వాహనాలేవీ రోడ్డెక్కకపోవడంతోనే పీఎం 10 తీవ్రత తగ్గిందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాహనాల కారణంగానే దుమ్ము ధూళి కణాలు అయితే రెండు ఏరియాలు మినహా మిగిలిన అన్ని ఏరియాల్లోనూ నిర్దేశిత మార్కు కంటే అధికంగా నమోదైంది. కేబీఆర్ఎన్ పార్కు, రాజేంద్ర నగర్‌లో మాత్రం నిర్దేశిత మార్కు కంటే తక్కువగానే ఉంది. జీడిమెట్ల బాలా నగర్‌లో అయితే 100 ఎంజీలు దాటేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout