తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్.. రాత్రిపూట కర్ఫ్యూ?
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిందని అంతా ప్రశాంతంగా ఉన్న తరుణంలో మరోసారి విజృంభిస్తోంది. మొన్నటి వరకూ రెండు వందలకు పరిమితమైన కేసులు తాజాగా భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం నాలుగు వందలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి అప్రమత్తమవుతున్నాయి. కరోనా మహమ్మారి బారిన పడకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలను ప్రజలకు వెల్లడిస్తున్నాయి. అంతే కాకుండా తమ తరుఫున ఏం చేయాలనే దానిపై చర్చిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో సీఎం కేసీఆర్ ఏం చేయాలనే దానిపై ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సైతం హుటాహుటిన వైద్యశాఖాధికారులతో తాజాగా సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడిన మాటలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతోనే కరోనా కట్టడి సాధ్యమని మంత్రి ఈటల అన్నారు. కోవిడ్ పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. ప్రజలంతా భౌతిక దూరం పాటించాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఈటల ప్రజలను కోరారు.
మొత్తానికి తెలంగాణలో పరిస్థితి దారుణంగానే ఉందని తెలుస్తోంది. అయితే సీఎం కేసీఆర్ మరో ముందడుగు వేయబోతున్నట్టు సమాచారం. తెలంగాణలో లాక్ డౌన్ విధించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే రాత్రిపూట కర్ఫ్యూ..? పెట్టబోతున్నారని కూడా సమాచారం. ఇప్పటికే మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించడంతోపాటు రాత్రి పూట కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కేసులు పెరగకుండా చూసేందుకు తగు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లాక్ డౌన్.. కర్ఫ్యూ విధిస్తారని ప్రచారం జరుగుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout