లాక్ డౌన్ 5.0 : అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఎత్తివేత
- IndiaGlitz, [Sunday,May 31 2020]
న్యూ ఢిల్లీ : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం జూన్-30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు 5.0 లాక్‌డౌన్‌కు సంబంధఇంచిన కొత్త మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల్లో అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఎత్తివేసింది. ఈ పాస్‌లు, ప్రత్యేక అనుమతులు లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కాగా.. జూన్-08 నుంచి రాష్ట్రాల మధ్య ప్రజల రాకపోకలు, సరకుల రవాణా ఉంటుంది. ఇదివరకున్న కర్ఫ్యూ టైమింగ్స్‌లో కూడా కేంద్రం మార్పులు చేసింది.
ఇకపై రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ ఉండనుంది. అదే విధంగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగింపు ఉండనుంది. ఇదిలా ఉంటే.. అయితే ఏదైనా రాష్ట్రం కానీ, కేంద్ర పాలిత ప్రాంతం కానీ ప్రజారోగ్యం, పరిస్థితుల అంచనాలను బట్టి వ్యక్తుల కదలికలపై నియంత్రణలు అమలు చేయవచ్చని 5.0 నిబంధనల్లో పేర్కొంది. అలాంటి కదలికలకు సంబంధించి విధివిధానాలపై ముందుగా పబ్లిసిటీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.