లాక్ డౌన్ 5.0 : దశల వారీగా వీటికి మాత్రమే అనుమతి
- IndiaGlitz, [Sunday,May 31 2020]
కరోనా వ్యాప్తి నియంత్రణలోకి రాకపోవడంతో మరోసారి లాక్ డౌన్ (5.0)ను పొడిగించిన విషయం తెలిసిందే. కంటైన్మెంట్ జోన్లను పరిగణనలోకి తీసుకుని దేశంల లాక్ డౌన్‌ను జూన్ 30 వరకు పొడిగించిన కేంద్రం, కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఊరట కలిగించేలా అనేక సడలింపులు ప్రకటించింది.
ఈ మేరకు మూడు దశలుగా విభజించింది. కాగా జూన్-08 నుంచి మూడు దశలుగా ఈ సడలింపులు ఉంటాయ్.
తొలి దశలో సడలింపులు :-
మతపరమైన ప్రదేశాలు, ప్రార్థనా మందిరాలు
హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు, ఇతర ఆతిథ్య ప్రదేశాలు
షాపింగ్ మాళ్లు (భౌతికదూరం నిబంధనలు పాటించడంతో పాటు కేంద్రం ప్రకటించిన అన్ని ఆరోగ్య సూత్రాలను అమలు చేయాలి)
రెండో దశలో సడలింపులు :-
స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, ఇతర విద్యాసంస్థలు
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో చర్చలు జరిపిన తర్వాత ప్రారంభం
విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులతోనూ, భాగస్వాములతోనూ చర్చించి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను బట్టి విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం
మూడో దశలో సడలింపులు :-
అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, మెట్రో రైళ్లు
సినిమా హాళ్లు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టయిన్ మెంట్ పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, సమావేశ మందిరాలు.
సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతి, మతపరమైన కార్యకలాపాలు, వేడుకలు, ఇతర భారీ సభా సమావేశాలు గురించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనుంది.