మే-31 వరకు లాక్డౌన్ 4.0 .. మార్గదర్శకాలివే..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా దాని కట్టడికి విధించిన లాక్డౌన్ను మే 31 వరకూ పొడిగిస్తూ కేంద్రం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం అనగా మే-17తో 3.0 లాక్ డౌన్ ముగియనుండగా.. రేపట్నుంచి మళ్లీ కొనసాగనుంది. మే-18 నుంచి మే-31 వరకు లాక్ డౌన్ ఉండనుంది. కాగా.. లాక్డౌన్ను కొనసాగించాల్సిందేనని.. మరోవైపు ఆర్థిక కార్యకలాపాలు మొదలుపెట్టాలని ఇదివరకే ముఖ్యమంత్రులు వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని మోదీకి నిశితంగా వివరించారు. దీంతో ఇవాళ లాక్ డౌన్ పొడిగిస్తున్న కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం నుంచి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అయితే ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా కొన్ని మినహాయింపులు కూడా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
మార్గదర్శకాలు ఇవీ..
- ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య సమన్వయంతో అంతర్రాష్ట్ర రవాణా జరుపుకోవచ్చు.
- రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఆయా ప్రభుత్వాల నిర్ణయం ఆధారంగా రవాణా సేవలు నిర్వహించుకోవచ్చు.
- అన్ని రాష్ట్రాలు సరుకు రవాణా వాహనాలను అనుమతించాలి.
- కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కేవలం నిత్యావసరాల కోసమే అనుమతులు ఉంటాయి.
- సినిమా హాళ్లు, మ్యూజియంలు, షాపింగ్ మాల్స్, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, వినోద కేంద్రాలు, పార్కులు, డ్రామా థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, సమావేశ స్థలాలపై నిషేధం కొనసాగుతుంది.
- క్రీడా సముదాయాలు, స్టేడియంలను ప్రేక్షకులను అనుమతించకుండా తెరుచుకోవచ్చు.
- సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, మత, అన్ని రకాల వేడుకలు, గుమికూడడాలపై నిషేధం అమల్లో ఉంటుంది.
- అన్ని మతపరమైన ప్రదేశాలు, ప్రార్థనామందిరాలు మూసివేయాల్సిందే. మతపరమైన కార్యక్రమాల కోసం గుమికూడడం నియమోల్లంఘన కిందకు వస్తుంది.
- రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కఠినమైన రీతిలో కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
- దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు చేయడం వీలుకాదు. అయితే ఎయిర్ అంబులెన్స్ సేవలు, భద్రతా పరమైన కారణాల కోసం, అత్యవసర వైద్య సేవల కోసం, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతితో విమాన ప్రయాణాలు చేయవచ్చు.
- మెట్రో రైళ్లపై నిషేధం కొనసాగుతుంది.
- స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసివేత కొనసాగుతుంది.
- ఆన్ లైన్ విద్యాబోధన, దూరవిద్య బోధన కొనసాగించవచ్చు.
- హోటళ్లు, రెస్టారెంట్ల మూసివేత కొనసాగుతుంది. అయితే హోటళ్లను, లాడ్జీలను వైద్య, ఆరోగ్య, పోలీసు సిబ్బందికి కేటాయించినట్టయితే వాటిని తెరవొచ్చు.
- బస్ డిపోలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో ఉండే క్యాంటీన్లకు అనుమతి.
- ఆహార పదార్థాలు హోమ్ డెలివరీ చేసేందుకు రెస్టారెంట్లకు అనుమతి ఉంటుందని కేంద్రం మార్గదర్శకాల్లో నిశితంగా వివరించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com