రుణయాప్‌లను బ్లాక్ చేయాలి: హైకోర్టు ఆదేశం

  • IndiaGlitz, [Thursday,February 04 2021]

రుణయాప్‌లను బ్లాక్ చేయాలని తెలంగాణ డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. రుణయాప్‌లను బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. రుణయాప్‌లను తొలగించేందుకు వెంటనే ప్లేస్టోర్‌లను సంప్రదించాలన్నారు. రుణయాప్‌ల నిర్వాహకులను కట్టడి చేసేలా... వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది కళ్యాణ్ దీప్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీజే నేతృత్వంలోని ధర్మాసనం నేడు రుణయాప్‌లపై విచారణ జరిపింది. చైనా రుణయాప్ వల్ల బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పిటిషనర్ తెలిపారు.

రుణయాప్ వేధింపులపై నివేదిక సమర్పించాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు కూడా రుణయాప్‌ల కేసులకు సంబంధించి నివేదికలు ఇవ్వాలని సూచించింది. రుణయాప్‌లపై విచారణను మార్చి 18కి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. తెలంగాణలో రుణయాప్‌ల కారణంగా ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా రుణ గ్రహీతలు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు సైతం ఉన్నాయి.

కాగా.. ఇటీవలి కాలంలో రుణ గ్రహీతలను రుణయాప్‌ నిర్వాహకులు వేధిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదులు రావడంతో  సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన సూత్రధారితో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. ముంబయి కేంద్రంగా ఈ యాప్‌ నిర్వహిస్తూ, ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న చైనాకు చెందిన హి జియాంగ్‌ను అరెస్టు చేశారు. అతడితోపాటు అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వివేక్‌కుమార్‌ను సైతం అరెస్టు చేశారు.

More News

విజయ్ కోసం ఆమె అభిమానం ‘హద్దు’లు దాటింది.

ఓ యువతి అభిమానం ‘హద్దు’లు దాటింది. ఆమె చేసిన పనికి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల ఇళయ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘మాస్టర్’

'డియర్ మేఘ' ఫస్ట్ లుక్ రిలీజ్

మేఘా ఆకాష్,అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ''డియర్ మేఘ''.

బర్త్‌డే సందర్భంగా రాజశేఖర్ ఎమోషనల్.. కొత్త సినిమా ప్రారంభం

చాలా కాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన హీరో రాజశేఖర్ 2017లో ఎంట్రీ ఇచ్చి ‘గరుడవేగ, కల్కి’ వంటి సినిమాలతో మరోమారు తన స్టామినాను రుజువు చేసిన విషయం తెలిసిందే.

నగ్న చిత్రం పోస్ట్ చెయ్యిమన్న నెటిజన్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన పూజా హెగ్డే

హీరోహీరోయిన్లు అభిమానులకు చాలా దగ్గరగా ఉండటం కోసం ఇటీవలి కాలంలో సోషల్ మీడియాను విపరీతంగా వినియోగిస్తున్నారు.

‘రాహుల్ అనే నేను’.. స్టైల్ మార్చేశాను..!

ఎప్పుడూ సింపుల్‌గా.. వైట్ కలర్ పైజామా దుస్తుల్లో కనిపించే కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ ఒక్కసారిగా స్టైల్ మార్చేశారు.