రుణయాప్‌లను బ్లాక్ చేయాలి: హైకోర్టు ఆదేశం
Send us your feedback to audioarticles@vaarta.com
రుణయాప్‌లను బ్లాక్ చేయాలని తెలంగాణ డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. రుణయాప్‌లను బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. రుణయాప్‌లను తొలగించేందుకు వెంటనే ప్లేస్టోర్లను సంప్రదించాలన్నారు. రుణయాప్‌ల నిర్వాహకులను కట్టడి చేసేలా... వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది కళ్యాణ్ దీప్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీజే నేతృత్వంలోని ధర్మాసనం నేడు రుణయాప్‌లపై విచారణ జరిపింది. చైనా రుణయాప్ వల్ల బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పిటిషనర్ తెలిపారు.
రుణయాప్ వేధింపులపై నివేదిక సమర్పించాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు కూడా రుణయాప్‌ల కేసులకు సంబంధించి నివేదికలు ఇవ్వాలని సూచించింది. రుణయాప్‌లపై విచారణను మార్చి 18కి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. తెలంగాణలో రుణయాప్‌ల కారణంగా ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా రుణ గ్రహీతలు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు సైతం ఉన్నాయి.
కాగా.. ఇటీవలి కాలంలో రుణ గ్రహీతలను రుణయాప్ నిర్వాహకులు వేధిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదులు రావడంతో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన సూత్రధారితో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. ముంబయి కేంద్రంగా ఈ యాప్ నిర్వహిస్తూ, ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న చైనాకు చెందిన హి జియాంగ్ను అరెస్టు చేశారు. అతడితోపాటు అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వివేక్కుమార్ను సైతం అరెస్టు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout