లోఫర్ ట్రైలర్ చెప్పే కథ ఇదే..

  • IndiaGlitz, [Monday,November 09 2015]

వ‌రుణ్ తేజ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం లోఫ‌ర్. ఈ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ నిర్మించారు. త్వ‌ర‌లో లోఫ‌ర్ మూవీని రిలీజ్ చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు లోఫ‌ర్ ట్రైల‌ర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే...ఓ అమ్మ‌, ఓ నాన్న ఓ కొడుకు మ‌ధ్య జ‌రిగే క‌థ‌. చిన్న‌ప్పుడే కొడుకుని తీసుకుని దూరంగా వెళ్లిపోయి లోఫ‌ర్ గా పెంచిన‌ తండ్రి.,కొడుకు కోసం త‌పించే త‌ల్లి, చివ‌రికి త‌ల్లి, కొడుకు ఎలా క‌లుసుకున్నారు అనేది మిగిలిన క‌థ అని తెలుస్తుంది. పూరి మార్కు డైలాగ్స్, టేకింగ్ తో లోఫ‌ర్ ధియేట‌ర్ ట్రైల‌ర్ అదిరింది. వ‌రుణ్ తేజ్ మాస్ లుక్ కూడా బాగుంది. ఇదంతా చూస్తుంటే...ప్రేక్ష‌కులు కోరుకునే అన్ని అంశాలు ఉన్న లోఫ‌ర్ విజ‌యం ఖాయం అనిపిస్తుంది.

More News

కృష్ణ 'గాజుల కిష్ట‌య్య‌'కి 40 ఏళ్లు

సూప‌ర్‌స్టార్ కృష్ణ కెరీర్‌లో చెప్పుకోద‌గ్గ చిత్రంగా నిలిచింది 'గాజుల కిష్ట‌య్య‌'. క‌థ ప‌రంగానూ, సంగీతం ప‌రంగానూ అప్ప‌టి ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌కి నోచుకున్న ఈ సినిమాకి నాటి మేటి ద‌ర్శ‌కుడు ఆదుర్తి సుబ్బారావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

సారీ..అంటున్నఆలీ..

కామెడీ కింగ్ ఆలీ ఆడియో వేడుక‌ల్లో...హీరోయిన్స్ పై సెటైర్స్ వేస్తూ...వార్త‌ల్లో నిలుస్తున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో...హీరోయిన్ స‌మంత‌, యాంక‌ర్ సుమ ల‌పై సెటైర్స్ వేసి సంచ‌ల‌నం స్రుష్టించాడు.

సంక్రాంతి రేసులో సునీల్..

బాలక్రిష్ణ నటిస్తున్న తాజా చిత్రం డిక్టేటర్.ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు.ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ డైరెక్టర్ శ్రీవాస్ తో కలసి నిర్మించే డిక్టేటర్ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

కళ్యాణ్ రామ్ నెక్ట్స్ మూవీ ఫిక్స్..

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిఖార్జున్ తెరకెక్కించిన షేర్ సినిమా ఇటీవల రిలీజైంది.ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.అయితే కళ్యాణ్ రామ్ తన తదుపరి చిత్రం గురించి ప్రస్తుతం కథా చర్చలు ప్రారంభించాడు.

పూరి ఎవరి మాట వినడంతే..

డేరింగ్&డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లోఫర్.ఈ చిత్రంలో వరుణ్ తేజ్,దిశా పటాని జంటగా నటించారు. సి.కళ్యాణ్ ఈ సినిమాని నిర్మించారు.