'లోఫర్' ఆడియో రిలీజ్ డేట్...
Send us your feedback to audioarticles@vaarta.com
'కంచె'తో నటుడిగా మెప్పించాడు మెగా హీరో వరుణ్‌తేజ్. ఆ సినిమా తెచ్చిన గుర్తింపు వల్ల వరుణ్ నెక్ట్స్ ఫిల్మ్ 'లోఫర్' పై అందరి దృష్టి పడింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తల్లీకొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇందులో వరుణ్‌కి తల్లిగా రేవతిగా నటించింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని డిసెంబర్ 18న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సినిమ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను డిసెంబర్ 7న నిర్వహించడానికి నిర్మాత సి.కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నాడు. మరి ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా చిరంజీవి వస్తాడో లేక రామ్ చరణ్ హాజరవుతాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com