'లోఫర్' సక్సెస్ మీట్
Send us your feedback to audioarticles@vaarta.com
వరుణ్‌తేజ్, దిశాపటాని జంటగా నటించిన సినిమా `లోఫర్`. పూరి జగన్నాథ్ దర్శకుడు. సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రూపొందింది. సి.కల్యాణ్ సమర్పిస్తున్నారు. శ్రీ శుభశ్వేత ఫిలిమ్స్ పతాకంపై సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్, తేజ నిర్మాతలు. ఈ సినిమా డిసెంబర్ 17న విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ మీట్ ను శనివారం నిర్వహించారు.
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ``లోఫర్ సక్సెస్ సాధించి మంచిరెస్పాన్స్ ను రాబట్టుకుంది. వైజాగ్‌లో సక్సెస్ టూర్ వెళ్లాం. ప్రేక్షకులు బాగా రిజీవ్ చేసుకున్నాం. వరుణ్ నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. వరుణ్ తేజ్ చేసిన మూడు సినిమాల్లో మూడు డిఫరెంట్స్ చేశాడని అందరూ అంటున్నారు. అలాగూ పోసానికి, రేవతి గారికి కూడా చాలా మంది ఫోన్ చేసి అభినందించారట. మా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైంది. ఆదరిస్తున్న వారికి ధన్యవాదాలు`` అని తెలిపారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ ``వైజాగ్ సక్సెస్ టూర్లో ప్రేక్షకులు మమ్మల్ని బాగా రిజీవ్ చేసుకున్నారు. అన్నీ ఏరియాల నుంచి మంచి స్పందన వస్తోంది. భవిష్యత్తులోనూ పూరిగారితో సినిమాలు చేస్తాను`` అని చెప్పారు. సి.వి.రావు, వంశీ, చరణ్‌దీప్, సుద్దాల అశోక్‌తేజ, రమ్య తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments